కలసి బత్కలేమని.. కలసి ‘చితి’కిపోవాలని..

వారిది ఒకే ఊరు, ఒకే కులం. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే‌‌ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ ఫ్రెండ్‌షిప్ చేశారు. ఆ ఫ్రెండ్‌షిపే రానురాను ప్రేమగా మారడంతో ఒకర్నొకరు విడిచి ఉండలేనంత దగ్గరయ్యారు. కానీ, వీరి కదలికలను గమనించిన తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చారు. పెళ్లి చేసుకోవాలనుకున్నవారి నిర్ణయానికి అడ్డుచెప్పారు. దీంతో తల్లిదండ్రులను ఎదురించైనా ప్రేమవివాహం చేసుకోవాలని యువతి, యువకులు డిసైడ్ అయ్యారు. చివరకు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం […]

Update: 2020-02-18 05:12 GMT

వారిది ఒకే ఊరు, ఒకే కులం. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే‌‌ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ ఫ్రెండ్‌షిప్ చేశారు. ఆ ఫ్రెండ్‌షిపే రానురాను ప్రేమగా మారడంతో ఒకర్నొకరు విడిచి ఉండలేనంత దగ్గరయ్యారు. కానీ, వీరి కదలికలను గమనించిన తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చారు. పెళ్లి చేసుకోవాలనుకున్నవారి నిర్ణయానికి అడ్డుచెప్పారు. దీంతో తల్లిదండ్రులను ఎదురించైనా ప్రేమవివాహం చేసుకోవాలని యువతి, యువకులు డిసైడ్ అయ్యారు. చివరకు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం అనంతరం అనివార్య పరిస్థితుల్లో ఒకర్నొకరు దూరం అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల స్వామి (22), శివరాత్రి ఉమ(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకుంటామని ఇంట్లో చెప్పడంతో వీరి నిర్ణయాన్ని ఇరువురి తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో తల్లిదండ్రులను ఒప్పించేందుకు భయపడిన ప్రేమికులు మూడ్రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలోని సాయిబాబా ఆలయంలో వివాహం చేసుకొని ఇంటికి వెళ్లకుండా భువనగిరిలోనే ఉంటున్నారు. ఇంటికి వెళ్తే తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు వస్తాయని తెలిసి అక్కడే ఉంటున్నారు.

ఇంటికి వెళ్తే విడదీస్తారని భావించిన దంపతులు కలిసే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం భువనగిరి శివారులోని డాల్ఫిన్‌ హోటల్‌‌లో రూమ్‌ అద్దెకు తీసుకొని అంతకు ముందే తమతో తీసుకువచ్చిన పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం నవ దంపతులను గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే స్వామి చనిపోగా, యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని ఆ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ కుటుంబసభ్యులే తమ కొడుకును కొట్టి చంపారని స్వామి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగగా పోలీసులు సర్దిచెప్పారు.

Tags:    

Similar News