రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత తక్కువే.. ఇవాల్టి కేసులెన్నంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతానికి ఒమిక్రాన్తీవ్రత తక్కువేనని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి వివరించింది. కేవలం 38 ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు ఒకరికి మినహా ప్రైమరీ కాంటాక్ట్‌లో మరేవరిలోనూ కొత్త వేరియంట్నిర్ధారణ కాలేదన్నది. ఒమిక్రాన్ తేలినోళ్లలో ఎవరికీ సీరియస్ పరిస్థితి రాలేదని స్పష్టం చేసింది. మరోవైపు కరోనా తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్లు వివరించింది. గత వారం రోజులుగా సగటున 0.48 పాజిటివిటీ మాత్రమే తేలుతున్నట్లు పేర్కొన్నది. ప్రస్తుతం అన్ని ఆసుపత్రుల్లో కరోనా ఇన్పేషెంట్లుగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతానికి ఒమిక్రాన్తీవ్రత తక్కువేనని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి వివరించింది. కేవలం 38 ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు ఒకరికి మినహా ప్రైమరీ కాంటాక్ట్‌లో మరేవరిలోనూ కొత్త వేరియంట్నిర్ధారణ కాలేదన్నది. ఒమిక్రాన్ తేలినోళ్లలో ఎవరికీ సీరియస్ పరిస్థితి రాలేదని స్పష్టం చేసింది.
మరోవైపు కరోనా తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్లు వివరించింది. గత వారం రోజులుగా సగటున 0.48 పాజిటివిటీ మాత్రమే తేలుతున్నట్లు పేర్కొన్నది. ప్రస్తుతం అన్ని ఆసుపత్రుల్లో కరోనా ఇన్పేషెంట్లుగా ప్రభుత్వం, ప్రైవేట్‌లో కలిపి కేవలం 1197 మంది మాత్రమే ఉన్నట్లు వివరించింది. మరో 54,245 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.
కరోనా అప్డేట్..
కరోనా తెలంగాణ ఇండియా
కొత్తకేసులు 177 7,495
మొత్తం 6,80,251 3,47,74,361
మృతులు 4,018 4,79,023
ఒమిక్రాన్ వేరియంట్
కొత్తకేసులు 0
మొత్తం 38
మృతులు 0