కపుల్స్ కోసం ఫేస్‌బుక్ ప్రత్యేక చాటింగ్ యాప్

దిశ, వెబ్‌డెస్క్: జంటల కోసం ప్రత్యేకంగా ఒక చాటింగ్ యాప్‌ను ఫేస్‌బుక్ ఆవిష్కరించింది. దీని పేరు ట్యూన్‌డ్. దీని ద్వారా భాగస్వాములు చాటింగ్ చేసుకోవచ్చు, ఫొటోలు, సంగీతం షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు పంచుకున్న జ్ఞాపకాలను ఒక టైమ్‌లైన్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల్లో ఆపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న మెసెంజర్ మాదిరిగా కాకుండా కేవలం కపుల్స్ మాత్రమే వ్యక్తిగతంగా తమ బాసలు పంచుకోగల యాప్ […]

Update: 2020-04-09 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: జంటల కోసం ప్రత్యేకంగా ఒక చాటింగ్ యాప్‌ను ఫేస్‌బుక్ ఆవిష్కరించింది. దీని పేరు ట్యూన్‌డ్. దీని ద్వారా భాగస్వాములు చాటింగ్ చేసుకోవచ్చు, ఫొటోలు, సంగీతం షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు పంచుకున్న జ్ఞాపకాలను ఒక టైమ్‌లైన్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల్లో ఆపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇది ప్రస్తుతం ఉన్న మెసెంజర్ మాదిరిగా కాకుండా కేవలం కపుల్స్ మాత్రమే వ్యక్తిగతంగా తమ బాసలు పంచుకోగల యాప్ అని ఫేస్‌బుక్ కొత్త ఉత్పత్తులు తయారు చేసే బృందం తెలిపింది. ప్రత్యేకంగా వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులను తయారుచేయడానికే ఈ బృందాన్ని గతేడాది ఏర్పాటు చేశారు. ప్రారంభమైన తర్వాత మొదటగా హొబ్బీ యాప్‌ను వీరు విడుదల చేశారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా కేటగిరీలో ట్యూన్‌డ్ యాప్ అమెరికాలో 872వ స్థానంలో, కెనడాలో 550వ స్థానంలో ఉంది.

Tags: Facebook, Couple, Tuned, messenger, vid 19, Technology, Mark Zuckerberg

Tags:    

Similar News