కొవిడ్ 19 పోవడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికి నెలన్నర దాటింది.. కొవిడ్ 19 కేసులు మాత్రం పుడుతూనే ఉన్నాయి. ఇక పాజిటివ్ కేసులు ఇక లేవు అనే రోజు కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఆ రోజు కోసం ఇంకా కొన్ని రోజుల ఆగాలని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ చెబుతోంది. కచ్చితంగా చెప్పాలంటే మే 21 తేదీ వరకు ఎదురుచూడక తప్పదని అంటోంది. ఎండ్ ఈజ్ నియర్ పేరుతో ప్రచురించిన అధ్యయనంలో భారత్‌లో లాక్‌డౌన్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికి నెలన్నర దాటింది.. కొవిడ్ 19 కేసులు మాత్రం పుడుతూనే ఉన్నాయి. ఇక పాజిటివ్ కేసులు ఇక లేవు అనే రోజు కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఆ రోజు కోసం ఇంకా కొన్ని రోజుల ఆగాలని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ చెబుతోంది. కచ్చితంగా చెప్పాలంటే మే 21 తేదీ వరకు ఎదురుచూడక తప్పదని అంటోంది. ఎండ్ ఈజ్ నియర్ పేరుతో ప్రచురించిన అధ్యయనంలో భారత్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్న కారణంగా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.
లాజిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ విధానం ద్వారా ఈ విషయాన్ని అంచనా వేశారు. వైరస్ ప్రారంభమైన నాటి నుంచి పోలిస్తే ఇప్పటికి గరిష్టస్థాయికి చేరుకుంది. అయితే ఈ అధ్యయనంలో వైరస్ వ్యాప్తి రేటును కూడా పరిశోధించారు. ఇందులో తేలిన దాని ప్రకారం ప్రస్తుతం వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో మే 21 నాటికి 24,222 కేసులు నమోదుకానున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో 10,498 కేసులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న డేటా ఆధారంగానే ఈ అధ్యయనం జరిగిందని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రం అంచనాలు తారుమారు కావొచ్చని స్పష్టం చేశారు.
Tags – covid, corona, AP, Ongole, positive, Mumbai, predict, may 21