లక్షణాలను గూగుల్ చేయడం మంచిది కాదు… సర్వేలో వెల్లడి
దిశ, వెబ్‌డెస్క్: ఏ చిన్న సమస్య వచ్చినా గూగుల్‌ని ఆశ్రయించడం ఈమధ్య అందరికీ అలవాటుగా మారిపోయింది. అయితే తమకు ఏదైనా పెద్ద రోగానికి చెందిన లక్షణాలు వచ్చాయంటే ఇక అంతే సంగతులు… నిద్రపోకుండా, రాత్రంతా ఆలోచిస్తూ తెగ కంగారు పడిపోతుంటారు. అందుకే వ్యాధి లక్షణాలకు సంబంధించిన ఫలితాల్లో గూగుల్ పనితనాన్ని పరీక్షించడానికి ఒక అధ్యయనం చేశారు మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియా వారు. గూగుల్‌తో మరో 36 ఇంటర్నేషనల్ మొబైల్, వెబ్ ఆధారిత లక్షణాలు చెక్ చేసే […]
దిశ, వెబ్‌డెస్క్: ఏ చిన్న సమస్య వచ్చినా గూగుల్‌ని ఆశ్రయించడం ఈమధ్య అందరికీ అలవాటుగా మారిపోయింది. అయితే తమకు ఏదైనా పెద్ద రోగానికి చెందిన లక్షణాలు వచ్చాయంటే ఇక అంతే సంగతులు… నిద్రపోకుండా, రాత్రంతా ఆలోచిస్తూ తెగ కంగారు పడిపోతుంటారు. అందుకే వ్యాధి లక్షణాలకు సంబంధించిన ఫలితాల్లో గూగుల్ పనితనాన్ని పరీక్షించడానికి ఒక అధ్యయనం చేశారు మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియా వారు. గూగుల్‌తో మరో 36 ఇంటర్నేషనల్ మొబైల్, వెబ్ ఆధారిత లక్షణాలు చెక్ చేసే టూల్స్‌ని శోధించారు. వీటిలో కేవలం 36 శాతం మాత్రమే అవి కచ్చితంగా లక్షణాలు సరిపోలే వ్యాధిని చెబుతాయని ఇందులో తేలింది. వరుసగా మూడు సార్లు చెక్ చేసినపుడు మాత్రమే 52 శాతం కచ్చితంగా చెబుతున్నాయని బయటపడింది.
ఇక ఎక్కడ చికిత్స చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? అనే విషయాల గురించి కూడా వారు అధ్యయనం చేశారు. దీనిలో కూడా కేవలం 49 శాతం మాత్రమే కచ్చితంగా వివరాలు చెబుతాయని వెల్లడైంది. కాబట్టి ఈ టూల్స్‌ని నమ్ముకుని వ్యాధి లక్షణాలను ఇంట్లోనే సరిపోల్చుకోవడం ప్రోత్సహించదగినది కాదని ఈ అధ్యయనంలో పాల్గొన్న మిచెలా హిల్ పేర్కొన్నారు. తమ టూల్‌లోని ప్రశ్నలకు యూజర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఈ లక్షణాల చెకర్లు పనిచేస్తాయి. అందుకే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు ఆన్‌లైన్ టూల్స్ మీద పూర్తిగా ఆధారపడకుండా, కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే సంగ్రహించాలని మిచెలా సలహా ఇస్తున్నారు.