థ్రిల్లింగ్ 'నెట్రికన్'..
దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘నెట్రికన్’ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మిలింద్ రాయ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మిస్తుండగా.. టీజర్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో నయన్ బ్లైండ్ గర్ల్‌గా కనిపిస్తుండగా.. మరో కంటెంట్ ఉన్న రోల్ ఖాతాలో వేసుకుని.. మరోసారి యాక్టర్‌గా సత్తా చూపించింది. సిటీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అత్యాచారం, హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని […]
దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘నెట్రికన్’ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మిలింద్ రాయ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మిస్తుండగా.. టీజర్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో నయన్ బ్లైండ్ గర్ల్‌గా కనిపిస్తుండగా.. మరో కంటెంట్ ఉన్న రోల్ ఖాతాలో వేసుకుని.. మరోసారి యాక్టర్‌గా సత్తా చూపించింది. సిటీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అత్యాచారం, హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని ఒక గుడ్డి అమ్మాయి ఎలా ట్రాప్ చేసింది? వరుస హత్యలకు పాల్పడుతున్న హంతకున్ని ఎలా శిక్షించింది? అనేది కథ కాగా.. కళ్లు కనబడని అమ్మాయి సైకోను ఎలా ఎదుర్కోగలిగింది? అనేది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఎప్పటిలాగే నయన్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండగా కేవలం నిమిషం నిడివితో ఉన్న ఫెంటాస్టిక్ టీజర్ ప్రేక్షకులను సీటు చివరి అంచున కూర్చునేలా చేయగలిగింది. నయనతార మేకోవర్ హాలీవుడ్ మూవీని తలపిస్తుందంటున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తామని చెప్తున్నారు. ‘నెట్రికన్’ టీజర్ నిజంగా నయన్‌కు సూపర్ ట్రీట్ అని అభిప్రాయపడ్డారు.
కాగా నయన్ ‘నెట్రికన్’పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తుండగా.. అంతే డెడికేషన్, సిన్సియారిటీతో హార్డ్ వర్క్ చేస్తూ మరింత ఎత్తుకు ఎదగాలంటూ బర్త్ డే విషెస్ అందించారు నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్. ప్రపంచంలో ఉన్న మంచి అంతా నీకే జరగాలని ఆ దేవున్ని కోరుకున్నట్లు తెలిపారు.