పాతబస్తీలో టైటానిక్ సీన్‌లు.. టోలిచౌకిలో బ్యాట్‌మాన్‌కు కష్టాలు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరాన్ని గురువారం కురిసిన భారీ వర్షం ముంచెత్తిన సంగతి తెలిసిందే. 10 సెం.మీ వర్షాపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఓ వైపు భారీ వర్షంతో చాలా వరకు ఇండ్లకే పరిమితమైన నగరవాసులు క్షేమంగా ఉన్నా.. బయటకొచ్చిన జనాలు ఆగమాగం అయ్యారు. #hyderabadrains oldcity pic.twitter.com/YJXU3vQxPp — శరత్ చంద్ర | Sarath Chandra (TTDP) (@sambhadu) September 2, 2021 ముఖ్యంగా యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో వరద ప్రభావంతో వాహనాలు […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరాన్ని గురువారం కురిసిన భారీ వర్షం ముంచెత్తిన సంగతి తెలిసిందే. 10 సెం.మీ వర్షాపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఓ వైపు భారీ వర్షంతో చాలా వరకు ఇండ్లకే పరిమితమైన నగరవాసులు క్షేమంగా ఉన్నా.. బయటకొచ్చిన జనాలు ఆగమాగం అయ్యారు.
#hyderabadrains oldcity pic.twitter.com/YJXU3vQxPp
— శరత్ చంద్ర | Sarath Chandra (TTDP) (@sambhadu) September 2, 2021
ముఖ్యంగా యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో వరద ప్రభావంతో వాహనాలు కొట్టుకుపోయాయి. మరో ఇద్దరు వ్యక్తులు సైతం కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని బయటకు లాగారు. దీనికితోడు గురువారం కూరగాయల మార్కెట్ కావడంతో తోపుడు బండ్లు పడవలు అయ్యాయి. ఈ వీడియోలు తొలుత వాట్సాప్‌లల్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. #HyderabadRains హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు వర్షాలు, వరదలు, మీమ్స్ పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/thenameis_mr_j/status/1433532510399459331?s=20
టోలిచౌకి ఏరియాలో బ్యాట్‌మాన్ వరదల్లో చిక్కుకున్నాడని.. సూపర్ హీరోను కూడా వరదలు వదల్లేదని సెటైరికల్ పోస్టు అప్‌లోడ్ చేశారు ఓ నెటిజన్. మరొకరు అయితే, ఇంట్లో ఉన్న వారు లారీ ట్యూబ్ ధరించుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు మీమ్స్ క్రియేట్ చేశారు. పాతబస్తీలో టైటానిక్ మూవీ క్లైమాక్స్‌ను తలపించే సీన్‌లు దర్శనమిస్తున్నట్టు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్ చేసి నగరవాసులను అప్రమత్తం చేశారు. ఇవి కాస్తా ట్విట్టర్‌లో ట్రెండ్ కావడం విశేషం.
Trigger warning
Please don't step out
Take some precautions#HyderabadRains #HyderabadFloods #hyderabad https://t.co/SXowCZmOw4 pic.twitter.com/TgHRCyPHud— Shravan Kumar (@Shravankondoju) September 2, 2021