బావ ఇలాఖాలో ఓ రేటు… బామ్మర్ది ఇలాఖాలో మరో రేటు

దిశ ప్రతినిది, కరీంనగర్: కరోనా బాధితులపై ఆర్థిక భారం పడకూడదన్న ఆలోచనతో ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న చొరవ అభినందనీయమే అయినా ధరల వ్యత్యాసాలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చడం, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన వారిలోనూ కొవిడ్ లక్షణాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు సిటీ స్కాన్ చేస్తే తప్ప కరోనా ఎంతమేర ఉందో తెలయని పరిస్థితి నెలకొంది. దీంతో డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహకులు ధరలు […]

Update: 2021-05-15 08:30 GMT

దిశ ప్రతినిది, కరీంనగర్: కరోనా బాధితులపై ఆర్థిక భారం పడకూడదన్న ఆలోచనతో ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న చొరవ అభినందనీయమే అయినా ధరల వ్యత్యాసాలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చడం, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన వారిలోనూ కొవిడ్ లక్షణాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు సిటీ స్కాన్ చేస్తే తప్ప కరోనా ఎంతమేర ఉందో తెలయని పరిస్థితి నెలకొంది. దీంతో డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహకులు ధరలు పెంచి కొవిడ్ బాధితుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రజా ప్రతినిధులు డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహకులతో మాట్లాడిన మంత్రులు ధరలు తగ్గించాలని సూచించారు. ఈ మేరకు ధరలను కూడా మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర నిర్ణయించడంతో సామాన్యులు అయోమయానికి గురవుతున్నారు. సిరిసిల్ల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ సిటీ స్కాన్ రూ.2500 లకే చేయాలని డయగ్నస్టిక్ సెంటర్ల వారిని కోరారు. అయితే స్కాన్ ఫిల్మ్ కావాలంటే అదనంగా వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ఇదే ధరలకు సిరిసిల్ల ప్రాంతంలో అమలవుతాయని దీనివల్ల కరోనా బాధితులకు కొంత ఆర్థిక భారం తగ్గుతుందని కేటీఆర్ ఆశించారు. అయితే మరో వైపున సిద్దిపేటలో కూడా మంత్రి హరీష్ రావు చొరవ తీసుకుని డయగ్నస్టిక్ సెంటర్ల వారితో మాట్లాడి ఒప్పించారు. సిద్దిపేటలో సిటీ స్కాన్ చేయడానికి రూ. 2 వేలు, ఫిల్మ్ కావాలంటే అదనంగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని హరీష్ రావు ప్రకటించారు. సిరిసిల్లలో ఫిల్మ్ కావాలంటే వెయ్యి అదనంగా చెల్లించాల్సి వస్తుంటే పొరుగునే ఉన్న సిద్దిపేటలో రూ. 200 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని నిర్ణయించడం గమనార్హం. బావ హరీష్ ఇలాఖాలో తక్కువ రేటు ఉంటే, బావమరిది కేటీఆర్ ఇలాఖాలో ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు.

Tags:    

Similar News