బల్మూరి వెంకట్‌కు నెటిజన్ల షాక్.. డిపాజిట్ దక్కించుకోవాలని సెటైర్లు
దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌లో ఉపఎన్నికలో టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులతో పాటు ఆ పార్టీ నేతలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇది ఇలా ఉంటే హరీష్ రావు మనిషికి టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ నేత ప్యాట రమేష్ వ్యాఖ్యానించగా.. ఈటల గెలుపు కోసమే రేవంత్ రెడ్డి బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపారని మరికొందరు విసృత ప్రచారం చేస్తున్నారు. Nuvvu just oka bommavi thammi akkada. Me RR yeppudo surrender […]
దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌లో ఉపఎన్నికలో టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులతో పాటు ఆ పార్టీ నేతలు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇది ఇలా ఉంటే హరీష్ రావు మనిషికి టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ నేత ప్యాట రమేష్ వ్యాఖ్యానించగా.. ఈటల గెలుపు కోసమే రేవంత్ రెడ్డి బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపారని మరికొందరు విసృత ప్రచారం చేస్తున్నారు.
Nuvvu just oka bommavi thammi akkada. Me RR yeppudo surrender aipoyadu Eatela ki.
— Shiva Shankar Yadav (@shivashankar862) October 11, 2021
కానీ, హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ మాత్రం తన గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో.. ‘కాంగ్రెస్‌కు అనుకూలంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల సర్వే రిపోర్ట్, గెలుపు కాంగ్రెస్ దే అంటున్న సర్వే రిపోర్టులు’ అంటూ ట్వీట్ చేశారు. ‘పెద్దలు చెప్పినట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం మూడో వ్యక్తికి లాభం అవుతుంది అనట్టు హుజూరాబాద్ ఉపఎన్నికలు కూడా అలానే.. రెండు పార్టీల మధ్య వైరం మూడో పార్టీ గెలుపు దిశగా ఉంది. హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు కలిసొస్తుంది అంటున్న సర్వేయర్లు’.. అంటూ ఓ ప్రకటన అప్‌లోడ్ చేశారు.
Deposit ke dikku ledu.. Gelavadam enti Sir.
— Siraj (@LUCKYSIRAJ) October 11, 2021
కానీ, ఈ ప్రకటన చూసిన కాంగ్రెస్ శ్రేణులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా.. నెటిజన్లు మాత్రం ఆడుకుంటున్నారు. సార్ నిజాలు మాట్లాడాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. డిపాజిట్ దక్కడమే కష్టం అంటే.. గెలుపు గురించి మాట్లాడుతున్నారేంటి సార్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అదంతా లగడపాటి సర్వేనే ఇగ అంటూ చురకలు వేస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బల్మూరి వెంకట్ కాంగ్రెస్ నిలబెట్టిన బొమ్మ అని.. రేవంత్ రెడ్డి ఈటలకు సరెండర్ అయిపోయారంటూ ఆరోపణలు చేయడం గమనార్హం.
😜
— Geetha Ainala🕉🇮🇳✋ (@gsjv1015) October 11, 2021