చిన్మయి హెల్పింగ్ నేచర్‌కు నెటిజన్ల ప్రశంస
సింగర్ చిన్మయి శ్రీపాద ఎంత మధురంగా పాడగలదో అంతే ఆప్యాయంగా ఇతరుల కష్టాల్లోనూ పాలుపంచుకోగలదు. తప్పు చేస్తే అంతే గట్టిగా సమాధానమూ చెప్పగలదు. కరోనా కష్ట కాలంలో తన వాయిస్ గ్రీటింగ్స్ ద్వారా డబ్బులు సంపాదించి ఆకలితో అలమటిస్తున్న వారికి సాయం చేసిన చిన్మయి.. ఇప్పుడు చావుబతుకుల్లో పోరాడుతున్న 22 ఏళ్ల అమ్మాయి ప్రాణాన్ని కాపాడేందుకు ఫండ్ రైజ్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ అమ్మాయికి మూడు నాలుగు రోజుల్లో సర్జరీ చేయాలని పోస్ట్ చేసిన […]
సింగర్ చిన్మయి శ్రీపాద ఎంత మధురంగా పాడగలదో అంతే ఆప్యాయంగా ఇతరుల కష్టాల్లోనూ పాలుపంచుకోగలదు. తప్పు చేస్తే అంతే గట్టిగా సమాధానమూ చెప్పగలదు. కరోనా కష్ట కాలంలో తన వాయిస్ గ్రీటింగ్స్ ద్వారా డబ్బులు సంపాదించి ఆకలితో అలమటిస్తున్న వారికి సాయం చేసిన చిన్మయి.. ఇప్పుడు చావుబతుకుల్లో పోరాడుతున్న 22 ఏళ్ల అమ్మాయి ప్రాణాన్ని కాపాడేందుకు ఫండ్ రైజ్ చేసింది.
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ అమ్మాయికి మూడు నాలుగు రోజుల్లో సర్జరీ చేయాలని పోస్ట్ చేసిన చిన్మయి.. బ్రెయిన్ స్కాన్, డాక్యుమెంట్స్ సెండ్ చేసింది. మూడు రోజుల క్రితం పెట్టిన పోస్టుకు భారీ రెస్పాన్స్ రాగా.. అక్షయ ట్రస్ట్ సహకారంతో ఐదు లక్షలు కలెక్ట్ అయ్యేలా చేసింది చిన్మయి. దీంతో గురువారం పాపకు వైద్యులు సర్జరీ చేయగా.. పాప ఇప్పుడు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో చిన్మయి హెల్పింగ్ నేచర్‌కు ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.