నేహా ధూపియాపై నెటిజన్స్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ఎంటీవీలో ప్రసారమయ్యే రౌడీస్ షోకు దేశ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా తీసుకున్న నిర్ణయంతో భారీగా ట్రోల్ అవుతున్నారు. నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. రౌడీస్ ఐదో సీజన్‌లో భాగంగా రెండు ఎపిసోడ్లు ప్రారంభమయ్యాయి. ఈ ప్రోగ్రాంలో ఒక అబ్బాయి తనను పార్ట్‌నర్ చీట్ చేసిందని చేయి చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో అబ్బాయికి కాకుండా చీట్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఎంటీవీలో ప్రసారమయ్యే రౌడీస్ షోకు దేశ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా తీసుకున్న నిర్ణయంతో భారీగా ట్రోల్ అవుతున్నారు. నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. రౌడీస్ ఐదో సీజన్‌లో భాగంగా రెండు ఎపిసోడ్లు ప్రారంభమయ్యాయి. ఈ ప్రోగ్రాంలో ఒక అబ్బాయి తనను పార్ట్‌నర్ చీట్ చేసిందని చేయి చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో అబ్బాయికి కాకుండా చీట్ చేసిన అమ్మాయికి సపోర్ట్ చేసింది నేహా. అలా ఎలా చేస్తావంటూ క్లాస్ పీకింది. దీంతో మోసపోయిన అబ్బాయికి కాకుండా తనను ఎలా సపోర్ట్ చేస్తావంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులు, మిత్రులు, తనతో పని చేస్తున్న అందరికి కూడా ఈ విషయం గురించి మెస్సేజ్‌లు చేస్తూ హరాజ్ చేస్తున్నారట. తన తండ్రి సోషల్ మీడియా ఎకౌంట్‌లో ఇందుకు సంబంధించి ట్రోల్స్ విపరీతంగా రావడంతో సోషల్ మీడియాలో నోట్ రిలీజ్ చేసింది నేహాధూపియా. తాను అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేశానో వివరణ ఇచ్చింది.
భారతదేశంలో అమ్మాయిలపై చేయిచేసుకోవడం తప్పు.. వాయిలెన్స్ అనేది నేరం… అందుకే తాను అమ్మాయికే మద్ధతు ఇచ్చానని తెలిపింది. దీనికి ఇంతగా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారని మండిపడింది. అయితే ఈ నోట్ రిలీజ్ చేసిన తర్వాత మరిన్ని కామెంట్స్ వస్తున్నాయి. కేవలం మీడియా అటెన్షన్, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తుందని మండిపడుతున్నారు. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలను కొట్టానని చెప్పినప్పుడు నేహా రియాక్షన్.. ఒక అబ్బాయి అమ్మాయిని కొట్టినప్పుడు ఇచ్చిన రియాక్షన్‌ను కంపేర్ చేస్తూ.. ఇదేనా నీ స్టాండ్ అని ప్రశ్నిస్తున్నారు.
Tags: Neha Dhupia, Roadies Show, Netizens, Bollywood