రష్మిపై నెటిజన్ల ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ జబర్దస్త్ యాంకర్ రష్మి ఓ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరుకావడంపై మండిపడుతున్నారు నెటిజన్లు. రాజమహేంద్ర వరంలో ఓ స్టోర్‌ను ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రష్మిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు జనాన్ని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. దీంతో ఈ సమయంలో ఓపెనింగ్ అంటూ తిరగాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నిన్ను చూసేందుకు వచ్చిన జనాలకు కరోనా సోకితే ఎవరిది బాధ్యత అంటూ ఫైరయ్యారు. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ జబర్దస్త్ యాంకర్ రష్మి ఓ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరుకావడంపై మండిపడుతున్నారు నెటిజన్లు. రాజమహేంద్ర వరంలో ఓ స్టోర్‌ను ప్రారంభ కార్యక్రమానికి హాజరైన రష్మిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు జనాన్ని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. దీంతో ఈ సమయంలో ఓపెనింగ్ అంటూ తిరగాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నిన్ను చూసేందుకు వచ్చిన జనాలకు కరోనా సోకితే ఎవరిది బాధ్యత అంటూ ఫైరయ్యారు. ఇన్ని రోజులు షూటింగ్‌లకు వెళ్లాల్సి వస్తుంది.. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందన్న రష్మి.. ఇప్పుడిలా స్పెషల్ ప్రోగ్రాంలకు హాజరుకావడంపై మండిపడుతున్నారు.
దీంతో ఈ ఘటనపై క్షమాపణలు కోరింది రష్మి. స్టోర్ యాజమాన్యంతో చాలా రోజుల క్రితం జరిగిన ఒప్పందం వల్లే .. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిందని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రారనే అనుకున్నామని … కానీ కరోనాపై అవగాహన లేకపోవడంతో వచ్చారని తెలిపింది. కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందుకు జాగ్రత్తపడాలన్న రష్మి.. ఎవరినైనా ఇబ్బందికి గురిచేసి ఉంటే క్షమించాలని కోరింది.
Tags: Rashmi Gautham, Jabrdasth, Anchor, Netizens