LinkdIn: భారత ఉత్తమ కంపెనీగా టీసీఎస్

ఈ జాబితాలో ఐటీ సేవలందించే కంపెనీలు ఆధిపత్యం కలిగి ఉండటం విశేషం.

Update: 2025-04-08 16:45 GMT
LinkdIn: భారత ఉత్తమ కంపెనీగా టీసీఎస్
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ లింక్డ్‌ఇన్‌ మంగళవారం భారత్‌లోని ఉత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది కూడా టీసీఎస్ ఈ జాబితాలో తొలి స్థానం సాధించింది. టీసీఎస్ తర్వాత యాక్సెంచర్, ఇన్ఫోసిస్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఐటీ సేవలందించే కంపెనీలు ఆధిపత్యం కలిగి ఉండటం విశేషం. తదుపరి స్థాయికి ఎదిగే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, కంపెనీ వెలుపల అవకాశాలు, సంస్థలో ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు, లింగ వైవిధ్యం, విద్య, ఉద్యోగుల ఉనికి లాంటి కీలక అంశాల ఆధారంగా లింక్డ్ఇన్ ఈ జాబితాను రూపొందిస్తుంది. లింక్డ్ఇన్ డేటా ప్రకారం.. ఈ టాప్ 25 కంపెనీలు ఒక్కొక్కటి 5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ప్రధానంగా క్యాపిటల్ మార్కెట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్‌లలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, ఫ్రాడ్ అనలిస్ట్, ఆర్థిక మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్‌పై పట్టు ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి.

లింక్డ్‌ఇన్-2025 జాబితాలోని టాప్ 10 కంపెనీలు

1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) - ఐటీ సేవలు

2. యాక్సెంచర్: కన్సల్టింగ్, ఐటీ సేవలు

3. ఇన్ఫోసిస్: ఐటీ సేవలు

4. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్: ఆర్థిక సేవలు

5. కాగ్నిజెంట్: ఐటీ సేవలు

6. ఒరాకిల్: సాఫ్ట్‌వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్

7. జేపీ మోర్గాన్ చేజ్: ఆర్థిక సేవలు

8. అమెజాన్: ఇ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్

9. ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్): టెక్నాలజీ

10. డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ): ఆర్థిక సేవలు

Tags:    

Similar News