టీఆర్ఎస్ ప్లీనరీపై నెటిజన్ల ఫైర్.. ఫ్లెక్సీల ఖర్చులో కొంతైనా ఇవ్వొచ్చుగా..

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం జరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. వైద్యురాలు డ్యూటీలో ఉండగా.. ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపోయి కింద పడగా వైద్యురాలి తలకు గాయమైంది. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో ఈ ఘటన జరిగింది. అయితే, నిత్యం వందల మంది వచ్చే ఆస్పత్రిలో ఇలాంటి దుస్థితి ఉండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అంటూ కోట్లు ఖర్చు పెట్టే ప్రతినిధులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘1910 లో […]

Update: 2021-10-25 08:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం జరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. వైద్యురాలు డ్యూటీలో ఉండగా.. ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపోయి కింద పడగా వైద్యురాలి తలకు గాయమైంది. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో ఈ ఘటన జరిగింది. అయితే, నిత్యం వందల మంది వచ్చే ఆస్పత్రిలో ఇలాంటి దుస్థితి ఉండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అంటూ కోట్లు ఖర్చు పెట్టే ప్రతినిధులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘1910 లో రూ.2 కోట్లతో నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి లక్షల మందికి ఆరోగ్య ప్రదాతగా నిలిచింది. ఇలాంటి ఘటనలతో మరోసారి వార్తల్లోకెక్కడం దురదృష్టకరం. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇలా హోర్డింగ్లు, ఫ్లెక్సీలకు ఖర్చుపెట్టేబదులు ఉస్మానియా ఆసుపత్రికి విరాళంగా ఇవ్వొచ్చుగా. ’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/revathitweets/status/1452577316320661506?s=20

Tags:    

Similar News