అసెంబ్లీ సాక్షిగా అసత్యాలా.. కేసీఆర్‌ను కడిగిపారేస్తోన్న నెటిజన్లు!

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువకులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను, సీఎం కేసీఆర్ హామీలను ఎత్తిచూపుతూ ట్వీట్లు, పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున సాగుభూమి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఎన్నికల మేనిఫెస్టోలో […]

Update: 2021-10-06 08:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువకులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను, సీఎం కేసీఆర్ హామీలను ఎత్తిచూపుతూ ట్వీట్లు, పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ..

భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున సాగుభూమి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇవ్వలేదని వెల్లడించారు. దీంతో సీఎం కేసీఆర్ చేసిన వ్యా్ఖ్యలపై నెట్టింట చర్చ జరుగుతోంది. నెటిజన్లు 2018 ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కాపీలో ఉన్న షెడ్యూల్ కులాల సంక్షేమం అనే పేజీలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న అంశాన్ని తెలిపే పత్రాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ తప్పుగా చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు అసత్యాలు చెప్పడం కొత్తేమీ కాదంటూ.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర హామీలను గుర్తుచేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు, పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News