కలెక్టర్ అయితే.. కరోనా నిబంధనలు వర్తించవా?
దిశ ప్రతినిధి, మెదక్: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించండంటూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టరే.. మాస్కు ధరించకుండా, కోవిడ్ నిబంధనలు పాటించకుండా.. నిర్లక్ష్యం వహించడంపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులు కరోనా నిబంధనలు పాటించకపోయినా.. మాస్కు లేకుండా కన్పించినా అధికారులు రూ.వెయ్యి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక మంత్రి సైతం కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని చెబుతూనే ఉన్నారు. సీపీ జోయల్ డేవిస్ మాత్రం ప్రతిరోజూ […]
దిశ ప్రతినిధి, మెదక్: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించండంటూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టరే.. మాస్కు ధరించకుండా, కోవిడ్ నిబంధనలు పాటించకుండా.. నిర్లక్ష్యం వహించడంపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులు కరోనా నిబంధనలు పాటించకపోయినా.. మాస్కు లేకుండా కన్పించినా అధికారులు రూ.వెయ్యి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక మంత్రి సైతం కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని చెబుతూనే ఉన్నారు. సీపీ జోయల్ డేవిస్ మాత్రం ప్రతిరోజూ లాక్‌డౌన్ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నిబంధనలు పాటించని పలువురి వాహనాలు సీజ్ చేయడం, మాస్కు లేని వారికి జరిమానా విధిస్తున్నారు.
మరీ సాక్షాత్తు మంత్రి హరీశ్ రావు, సీపీ జోయల్ డేవిస్ తో కలిసి నూతన కలెక్టరేట్ పనులను పరిశీలిస్తున్న సమయంలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కు లేకుండా ఉన్న సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోడా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా అక్కడకు వచ్చిన మంత్రి హరీశ్ రావు, సీపీ జోయల్ డేవిస్, అక్కడున్న ఇతర సిబ్బంది అందరూ మాస్క్ ధరించారు. ఒక్క కలెక్టర్ మాత్రమే మాస్క్ దరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సామాన్యులకు వర్తించిన కరోనా నిబంధనలు.. అధికారులకు వర్తించవా… చట్టం అధికారులకు చుట్టంగా మారిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ మాస్కు ధరించనందున జరిమానా విధిస్తాడో లేదో చూడాలి.