ICUలో శివ శంకర్ మాస్టర్.. నీకు సిగ్గుందా అంటూ మంచు విష్ణుపై ట్రోల్స్
దిశ, వెబ్‌డెస్క్: మా అధ్యక్షుడు మంచు విష్ణుపై ఓ నెటిజన్ ఘాటు కామెంట్ చేశాడు. ఇటీవల కరోనా పాజిటివ్ సోకి, ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ కావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్‌ను హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో చేర్పించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చావుతో పోరాడుతున్న ఆయన ఐసీయూ బెడ్‌పైనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన టాలీవుడ్ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరికొందరు అయితే.. చికిత్స కోసం ఆర్థిక సాయం […]
దిశ, వెబ్‌డెస్క్: మా అధ్యక్షుడు మంచు విష్ణుపై ఓ నెటిజన్ ఘాటు కామెంట్ చేశాడు. ఇటీవల కరోనా పాజిటివ్ సోకి, ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ కావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్‌ను హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్లో చేర్పించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చావుతో పోరాడుతున్న ఆయన ఐసీయూ బెడ్‌పైనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన టాలీవుడ్ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరికొందరు అయితే.. చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు.
కానీ, మా ప్రెసిడెంట్ హోదాలో ఉన్న మంచు విష్ణు స్పందనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యంపై డాక్టర్ల నుంచి వివరాలు సేకరించానని.. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థించాను అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. వెంటనే రియాక్ట్ అయిన నెటిజన్లు మరి ఆర్థిక సాయం చేయరా అంటూ నిలదీశారు. అంతటితోనూ ఆగలేదు. తాజాగా ఇన్‌స్టాలో ‘బోర్ కొడుతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చి తీరిగ్గా బెడ్ మీద సేదతీరాడు. అంతే ఈ ఫొటో చూసిన నెటిజన్స్ మళ్లీ ఫైర్ అయ్యారు. ఓ వైపు శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉండి ఐసీయూలో ఉంటే .. బోరింగ్‌గా ఉందా.. నీకు సిగ్గిండాలి అంటూ ఓ నెటిజన్ ఘాటుగా బదులివ్వడం గమనార్హం.