#ShameOnBcci.. విరాట్ కోహ్లీ కోసం నెటిజన్ల వార్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను నియమిస్తున్నట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక ఈ వార్త విన్న విరాట్ కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. టీమిండియా తరఫున తనదైన ముద్ర వేసిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి అర్థాంతరంగా తప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నెట్టింట్లో #ShameOnBcci హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ, జనరల్ సెక్రటరీ జైషాలు ఇద్దరు కలిసి కుట్రలు చేశారంటూ ఆరోపించడం గమనార్హం. ఓరాల్ […]
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను నియమిస్తున్నట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక ఈ వార్త విన్న విరాట్ కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. టీమిండియా తరఫున తనదైన ముద్ర వేసిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి అర్థాంతరంగా తప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నెట్టింట్లో #ShameOnBcci హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ, జనరల్ సెక్రటరీ జైషాలు ఇద్దరు కలిసి కుట్రలు చేశారంటూ ఆరోపించడం గమనార్హం. ఓరాల్ మ్యాచ్‌ల్లో విన్నింగ్స్ పర్సంటేజ్ కోహ్లీ సారథ్యంలోనే అధికంగా ఉందని గుర్తు చేస్తున్నారు. ఐసీసీ ట్రోఫీల్లో ఇతర ఆటగాళ్లు రాణించకపోవడంతో ఆ సాకును కెప్టెన్‌పై వేసి తొలగించడం ఎంతవరకు సమంజసం కాదని మండిపడుతున్నారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టకుండా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
This national embarrassment replaced the national treasure. #ShameOnBCCI pic.twitter.com/SZOGj9G0Yz
— A l V Y (@9seventy3) December 9, 2021