‘పాస్‌వర్డ్ షేరింగ్’ అడ్డుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఎత్తుగడ
దిశ, ఫీచర్స్: పాండమిక్ ముందు నుంచి నెటిజన్లు ఓటీటీల బాట పడుతున్నా, లాక్‌డౌన్ తర్వాత ఓటీటీలకు కస్టమర్లు విపరీతంగా పెరిగారు. అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌ల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవడం పరిపాటే. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ‘పాస్‌వర్డ్’ పంచుకోవడం సరికాదంటోంది. తమ నిబంధనల ప్రకారం టూ స్టెప్ వెరిఫికేషన్ చేయడం వల్ల డిజిటిల్ భద్రత ఉంటుందంటోంది. పాస్‌వర్డ్ భాగస్వామ్యాన్ని నిరోధించడానికి నెట్‌ఫ్లిక్స్ ఒక మార్గాన్ని పరీక్షించడం ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ ఇలా చేయడానికి […]
దిశ, ఫీచర్స్: పాండమిక్ ముందు నుంచి నెటిజన్లు ఓటీటీల బాట పడుతున్నా, లాక్‌డౌన్ తర్వాత ఓటీటీలకు కస్టమర్లు విపరీతంగా పెరిగారు. అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌ల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవడం పరిపాటే. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ‘పాస్‌వర్డ్’ పంచుకోవడం సరికాదంటోంది. తమ నిబంధనల ప్రకారం టూ స్టెప్ వెరిఫికేషన్ చేయడం వల్ల డిజిటిల్ భద్రత ఉంటుందంటోంది. పాస్‌వర్డ్ భాగస్వామ్యాన్ని నిరోధించడానికి నెట్‌ఫ్లిక్స్ ఒక మార్గాన్ని పరీక్షించడం ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ ఇలా చేయడానికి కారణమేంటీ?
2020లో ‘టైగర్ కింగ్, మనీ హీస్ట్’ వంటి సూపర్ డూపర్ హిట్ షోలతో పాటు మరెన్నో అద్భుతమైన సిరీస్, సినిమాలతో ప్రపంచవ్యాప్త అదరణ అందుకుంది నెట్‌ఫ్లిక్స్. గతేడాది నెట్‌ఫ్లిక్స్ దాదాపు 37 మిలియన్ల కొత్త కస్టమర్లను పొందింది. తద్వారా దాదాపు 2.8 బిలియన్ డాలర్ల లాభాలను కూడా అందుకోంది.
అయితే ఈ ఏడాదిలో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త యూజర్స్ రావడం లేదు. అందుకే ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఈ నెల ప్రారంభంలో కొంతమంది వినియోగదారులకు ‘మీరు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌తో నివసించకపోతే, కీప్ టు వాచ్’ అనే సందేశాన్ని సెండ్ చేసింది. ఈ మెసేజ్ అందుకున్న యూజర్స్, తమ ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ధృవీకరించాలి. ఈ టెస్ట్ ద్వారా అకౌంట్ హోల్డర్స్ మాత్రమే తమ ఖాతాలను యూజ్ చేస్తున్నారని భావిస్తారు. కాగా ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉందని, త్వరలో దీని రోల్ అవుట్‌పై కంపెనీ నిర్ణయం తీసుకోలేదని నెట్ ఫ్లిక్స్ స్పోక్స్ పర్సన్ తెలిపారు.
చాలా మంది వినియోగదారులు వారి స్నేహితులు, కుటుంబీకులతో పాస్‌వర్డ్‌లను పంచుకుంటున్నారు. ఆ కారణంగా న్యూ డివైజ్ ఆథరైజేషన్ నియంత్రించడం చాలా కష్టం, అంతేకాదు ఒరిజినల్ యూజర్ గోప్యత, డిజిటల్ భద్రతకు కూడా ప్రమాదం ఉందని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ హెడ్ గ్రెగ్ పీటర్స్ వెల్లడించారు. టూ స్టెప్ అథెంటికేషన్ వినియోగదారులు తమ కోడ్‌లను భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది. ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ప్రధాన ఖాతాదారుడు తమ ఖాతాను వారు అధికారం పొందిన వ్యక్తి ఉపయోగిస్తున్నారనే విషయం నిర్ధారణ అవుతుందని ఆయన పేర్కొన్నాడు. మీరు మీ లాగిన్‌ను కేవలం ఒక మిత్రుడితో పంచుకోగలిగినప్పటికీ, వారు ఎంత మంది వ్యక్తులతో పంచుకుంటారో తెలియదు. దీన్ని మనం నియంత్రించలేం. సీనియర్ రచయిత లిల్లీ హే న్యూమాన్ కొన్ని ఏళ్ల క్రితం ఆమె స్వయంగా ‘హులు’ అకౌంట్‌ను ఆడిట్ చేసినప్పుడు, తన ఖాతాను 90కి పైగా మంది ఉపయోగిస్తున్నట్లు తెలుసుకుంది.