‘బాహుబలి’ని పక్కనపెట్టిన నెట్‌ఫ్లిక్స్.. రూ.200 కోట్లతో ప్రయోగం
దిశ, సినిమా : వరల్డ్ రిచెస్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు రూ.100 కోట్లు రూ.100 రూపాయలతో సమానం అని చెప్తుంటారు. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ ఔట్‌పుట్‌తో శాటిస్‌ఫై కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దాన్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. రూ.100 కోట్లతో తెరకెక్కిన సిరీస్‌ను స్క్రాప్‌లాగా భావిస్తూ ప్రస్తుతం రూ.200 కోట్లతో సిరీస్‌ను తెరకెక్కిస్తోంది. అంతకు ముందుకన్నా డబుల్ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌పై రీవర్క్ చేయించిన నెట్‌ఫ్లిక్స్, ప్రజెంట్ స్టార్ […]
దిశ, సినిమా : వరల్డ్ రిచెస్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు రూ.100 కోట్లు రూ.100 రూపాయలతో సమానం అని చెప్తుంటారు. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ ఔట్‌పుట్‌తో శాటిస్‌ఫై కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దాన్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. రూ.100 కోట్లతో తెరకెక్కిన సిరీస్‌ను స్క్రాప్‌లాగా భావిస్తూ ప్రస్తుతం రూ.200 కోట్లతో సిరీస్‌ను తెరకెక్కిస్తోంది. అంతకు ముందుకన్నా డబుల్ బడ్జెట్‌తో రూపొందిస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్‌పై రీవర్క్ చేయించిన నెట్‌ఫ్లిక్స్, ప్రజెంట్ స్టార్ కాస్ట్ అండ్ టెక్నికల్ టీమ్‌తో రీషూట్ చేయిస్తోంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ధీటుగా భారత్ నుంచి వచ్చిన ‘బాహుబలి’ని అదే స్థాయిలో నిలబెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. న్యూ బడ్జెట్ రూ.200 కోట్లు, ఓల్డ్ బడ్జెట్ రూ.100 కోట్లతో కలిపి మొత్తం రూ.300 కోట్ల బడ్జెట్‌కు చేరిన సిరీస్ రెండు సీజన్లలో తొమ్మిది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది. మాహిష్మతి సామ్రాజ్యంలో శివగామి ఎదుగుదలను ఈ సిరీస్‌లో చూపించబోతుండగా బాలీవుడ్ హీరోయిన్ మృణాళి ఠాకూర్ శివగామిగా కనిపించనుందని సమాచారం.