గేమ్ గెలవండి.. లైఫ్‌టైమ్ ‘నెట్‌ఫ్లిక్స్’ ఫ్రీగా పొందండి!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. అందులోనూ నెట్‌ఫ్లిక్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంది. అయితే.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే, నెల నెల.. కొంత డబ్బు కట్టాలి. మరి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండా? నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అది కూడా ఒక్క నెలో.. రెండు నెలలో కాదు, ఏకంగా లైఫ్‌టైమ్. దాదాపు 83 సంవత్సరాల వరకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం వచ్చేసింది. అందుకు ఏం చేయాలో చదవండి. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. అందులోనూ నెట్‌ఫ్లిక్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంది. అయితే.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే, నెల నెల.. కొంత డబ్బు కట్టాలి. మరి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండా? నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అది కూడా ఒక్క నెలో.. రెండు నెలలో కాదు, ఏకంగా లైఫ్‌టైమ్. దాదాపు 83 సంవత్సరాల వరకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం వచ్చేసింది. అందుకు ఏం చేయాలో చదవండి.
నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందాలంటే.. జస్ట్ ఓ గేమ్ ఆడాలి. అంటే ఇక్కడ గేమ్ ఆడితేనే సరిపోదు. ఆ గేమ్‌లో విజేతగా నిలవాలి. ఎవరు గెలిస్తే.. వారికి ‘ఇమ్మోర్టల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్.. అకౌంట్ అందిస్తోంది. దీని ద్వారా దాదాపు 83 నెలల వరకు నెట్‌ఫ్లిక్స్ వీడియోలు ఉచితంగా చూడొచ్చు. అయితే గేమ్ ఆడేముందు.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘చార్లెస్ థెరోన్’ లీడ్ రోల్ పోషించినటువంటి ‘ద ఓల్డ్ గార్డ్’ మూవీని చూస్తే.. గేమ్‌పై ఓ అవగాహన వస్తుంది. గేమ్‌లో మనది చార్లెస్.. అంటే ఇంచుమించు హీరో క్యారెక్టర్. శత్రువుల గ్యాంగ్‌లపై దాడిచేస్తూ.. వారిని ఓడించాలి. ఈ క్రమంలో మనపై దెబ్బపడకుండా, ఓడిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ శత్రువుల దాడిలో మనం చనిపోతే.. స్కోరు తగ్గిపోతుంది. ఆట మళ్లీ ఆడొచ్చు. అయితే.. అత్యధిక స్కోరు సాధించిన వారే విజేతగా నిలుస్తారు. నెట్‌ప్లిక్స్ అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు (జులై 17, 18, 19 తేదీల్లో) మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ యూఎస్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మాత్రమే.
ఇంతకీ ఆ గేమ్ పేరు ఏంటో తెలుసా.. ‘ద ఓల్డ్ గార్డ్ గేమ్’.