నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘పిట్ట కథలు’
దిశ, వెబ్‌డెస్క్: నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ వచ్చేసింది. ‘పిట్ట కథలు’ పేరుతో తొలి తెలుగు ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఆంథాలజీలో శ్రుతి హాసన్, లక్ష్మీ మంచు, ఈషా రెబ్బ, అమలా పాల్, జగపతి బాబు లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ ఫిబ్రవరి 19న ఫిల్మ్ ప్రసారం కాబోతున్నట్లు ప్రకటించింది. నలుగురు […]
దిశ, వెబ్‌డెస్క్: నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ వచ్చేసింది. ‘పిట్ట కథలు’ పేరుతో తొలి తెలుగు ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఆంథాలజీలో శ్రుతి హాసన్, లక్ష్మీ మంచు, ఈషా రెబ్బ, అమలా పాల్, జగపతి బాబు లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్ ఫిబ్రవరి 19న ఫిల్మ్ ప్రసారం కాబోతున్నట్లు ప్రకటించింది. నలుగురు మహిళల ప్రేమ, ద్రోహంతో కూడిన నాలుగు ప్రయాణాలను ఆంథాలజీలో చూపించబోతుండగా.. పితృస్వామ్య వ్యవస్థను కూల్చివేయాలని కోరుకోవడమే ఈ నాలుగు పిట్ట కథల్లో కామన్ పాయింట్. కాగా, ఆర్ఎస్‌వీపీ మూవీస్, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్టైన్మెంట్ ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌ను సంయుక్తంగా నిర్మించాయి.