‘బాహుబలి’పై పెదవి విరిచిన నెట్‌ఫ్లిక్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ‘బాహుబలి’. జక్కన్న డైరెక్షన్‌లో రెండు పార్ట్‌లు(బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి : ది కంక్లూజన్)గా వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డ్స్ సెట్ చేసింది. దీంతో ఈ ఫేమ్‌ను క్యాచ్ చేసుకోవాలనుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇండియా.. ‘బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఓ సిరీస్‌ను తెరమీదకు తీసుకొస్తున్నట్లు 2018లో ప్రకటించింది. ఈ సిరీస్ రాజమాత […]
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ‘బాహుబలి’. జక్కన్న డైరెక్షన్‌లో రెండు పార్ట్‌లు(బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి : ది కంక్లూజన్)గా వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రికార్డ్స్ సెట్ చేసింది. దీంతో ఈ ఫేమ్‌ను క్యాచ్ చేసుకోవాలనుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇండియా.. ‘బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఓ సిరీస్‌ను తెరమీదకు తీసుకొస్తున్నట్లు 2018లో ప్రకటించింది. ఈ సిరీస్ రాజమాత శివగామి ప్రయాణాన్ని వివరించేలా ఉంటుందని తెలిపింది. డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, ఆర్కా మీడియా వర్క్స్‌తో అసోసియేట్ అయిన నెట్‌ఫ్లిక్స్.. దేవ కట్టా, ప్రవీణ్ సత్తారును ఈ సిరీస్‌కు డైరెక్టర్లుగా ఎంచుకుంది. కానీ ఫైనల్ ఔట్‌పుట్‌తో అంతగా ఇంప్రెస్ కాని నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది.
కాగా మోస్ట్ అవెయిటింగ్ సిరీస్ ‘బాహుబలి – బిఫోర్ ది బిగినింగ్’ను మళ్లీ ఇప్పుడు రీషూట్ చేయాలని భావిస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఇందుకోసం కాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్తవారినే ఎంచుకోవాలని.. సిరీస్‌ను సరికొత్తగా క్రియేట్ చేయాలనుకుంటోంది. ఏఆర్ రెహమాన్ ‘99 సాంగ్స్’ డైరెక్టర్ విశ్వేశ్ కృష్ణమూర్తిని డైరెక్టర్‌గా ఎంచుకున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్.. క్రియేటివ్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్ రాజమౌళి సపోర్ట్ కూడా కోరిందని సమాచారం.
కాగా రెండు పార్ట్‌లుగా వస్తున్న సిరీస్‌లో మొదటి సిరీస్ తొమ్మిది ఎపిసోడ్‌ల సమాహారంగా ఉంటుందని తెలుస్తోంది. తిరుగుబాటు చేసే అమ్మాయిగా ఉన్న శివగామి.. తెలివైన రాకుమారిగా ఎలా ఎదిగిందనేది ఈ సిరీస్‌లో చూపించబోతున్నారని టాక్. రిచ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనున్న సిరీస్.. ఇంక్రెడిబుల్ నెరేటివ్ స్టైల్, హై ప్రొడక్షన్ వాల్యూస్, స్పెక్టాక్యులర్ విజువల్స్‌తో ఉండనుంది. కాగా ఏప్రిల్ 2021 నుంచి రీషూట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.