నేపాల్ వివాదాస్పద మ్యాప్‌కు పెద్దల సభ ఆమోదం

ఖాఠ్మాండు: నేపాల్ వివాదాస్పద మ్యాప్‌ బిల్లుకు ఆ దేశ పార్లమెంటులోని ఎగువసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత భూభాగాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురలను కలుపుకుని సవరించిన నేపాల్ రాజకీయ పటం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ చేస్తున్నది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంటులోని దిగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేపాల్ కృత్రిమ భూవిస్తరణ ప్రకటనలు సమర్థనీయం కాదని భారత్ ఘాటుగా స్పందించింది. తాజాగా, జాతీయ అసెంబ్లీ లేదా ఎగువసభ కూడా […]

Update: 2020-06-18 03:48 GMT

ఖాఠ్మాండు: నేపాల్ వివాదాస్పద మ్యాప్‌ బిల్లుకు ఆ దేశ పార్లమెంటులోని ఎగువసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత భూభాగాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురలను కలుపుకుని సవరించిన నేపాల్ రాజకీయ పటం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ చేస్తున్నది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంటులోని దిగువసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేపాల్ కృత్రిమ భూవిస్తరణ ప్రకటనలు సమర్థనీయం కాదని భారత్ ఘాటుగా స్పందించింది. తాజాగా, జాతీయ అసెంబ్లీ లేదా ఎగువసభ కూడా వివాదాస్పద మ్యాపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభకు హాజరైన 57 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.

Tags:    

Similar News