రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌కు తీవ్రగాయాలు
దిశ, స్పోర్ట్స్: నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ లలిత్ బండారి ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జాలరి మార్కెట్ సమీపంలోని ఈస్ట్-వెస్ట్ హైవేపై తన బంధువుతో కలసి బైక్ మీద వెళ్తూ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బండారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ వెనుక కూర్చున్న బంధువు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బండీరీ కుడి భుజం, నడుము భాగంలో గాయాలైనట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై […]
దిశ, స్పోర్ట్స్: నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ లలిత్ బండారి ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జాలరి మార్కెట్ సమీపంలోని ఈస్ట్-వెస్ట్ హైవేపై తన బంధువుతో కలసి బైక్ మీద వెళ్తూ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బండారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ వెనుక కూర్చున్న బంధువు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బండీరీ కుడి భుజం, నడుము భాగంలో గాయాలైనట్లు అతని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (కాన్) స్పందించింది. యువ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అలాగే అతని పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని వరుస ట్వీట్లలో పేర్కొంది. లెఫ్టార్మ్ పేసర్ అయిన 24 ఏళ్ల లలిత్ బండారి 2018లో నెపాల్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. నెథర్లాండ్స్‌తో జరిగి ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అంతగా అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. లిస్ట్-ఏ, టీ20 క్రికెట్ మాత్రం ఆడాడు.
Read Also…