తినడం మర్చిపోతాడేమో కానీ.. అది మాత్రం?
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవలే కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టిన మనం.. గత పదేళ్లలో పుట్టుకొచ్చిన సరికొత్త ట్రెండ్స్‌కు, టెక్నాలజీపరంగా విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలిచాం. చివరకు కరోనా పాండమిక్, లాక్‌డౌన్, జూమ్ కాల్స్, సోషల్ డిస్టెన్స్, ఆన్‌లైన్ మ్యారేజెస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ కొత్త జీవనవిధానానికి అలవాటుపడ్డాం. ఇదే క్రమంలో సెల్ఫీలు కూడా మన జీవితంలో ఓ భాగంగా మారాయి. పెళ్లి వేడుకైనా, విహారయాత్రకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా, బజారులో అడుగుపెట్టినా.. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవలే కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టిన మనం.. గత పదేళ్లలో పుట్టుకొచ్చిన సరికొత్త ట్రెండ్స్‌కు, టెక్నాలజీపరంగా విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలిచాం. చివరకు కరోనా పాండమిక్, లాక్‌డౌన్, జూమ్ కాల్స్, సోషల్ డిస్టెన్స్, ఆన్‌లైన్ మ్యారేజెస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ కొత్త జీవనవిధానానికి అలవాటుపడ్డాం. ఇదే క్రమంలో సెల్ఫీలు కూడా మన జీవితంలో ఓ భాగంగా మారాయి. పెళ్లి వేడుకైనా, విహారయాత్రకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా, బజారులో అడుగుపెట్టినా.. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా సెల్ఫీ తీసుకోవాల్సిందే. మనలాగే అమెరికాకు చెందిన రేడియో ప్రజెంటేటర్ నియల్ గ్రే కూడా సెల్ఫీలు తీసుకుంటాడు. కానీ ఎప్పుడో సందర్భాన్ని బట్టి కాదు, క్రమంతప్పకుండా ప్రతీరోజు ఓ సెల్ఫీ తీసుకోవడాన్ని పదేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.తినడమైనా మర్చిపోతాడేమో కానీ, సెల్ఫీ మాత్రం మరవని నియల్.. తన డికేడ్ ఫొటోలతో ఓ వీడియో విడుదల చేయగా, అది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
I’ve been taking a picture of myself everyday for the past 10 years, this is me age 14 to 24 pic.twitter.com/zrhkFm4JiJ
— Niall Gray (@NiallGray) January 1, 2021
కాలం పరుగులు పెడుతున్న కొద్దీ మన వయసు కూడా దాంతో పోటీ పడుతుంది. చూస్తుండగానే మన శరీరంలో, ఆలోచనల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే నియల్ తనలో వచ్చే మార్పులను క్యాప్చర్ చేయాలనుకున్నాడు. అలా 14 ఏళ్ల వయసు నుంచి 24 ఏళ్లు వచ్చే వరకు రోజుకో సెల్ఫీ తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ దశాబ్దం పూర్తయిన సందర్భంగా.. ఆ ఫొటోలన్నింటితో ‘టైమ్‌లాప్స్’ వీడియో రూపొందించి, తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. చాలా భిన్నమైన కాన్సెప్ట్‌తో తను తీసిన వీడియో, కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.