నేటి నుంచి నెహ్రూ జూపార్క్ ఓపెన్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన నగరంలోని నెహ్రూ జూపార్కను నేటి నుంచి పున:ప్రారంభించనున్నారు. ఈ జూపార్కును ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్ లాక్ 5.0 క్రమంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ మంగళవారం నుంచి జూపార్కులోకి సందర్శకులను అనుమతించనున్నారు. గత మార్చి 15వ తేదీన మూతపడిన జూపార్క్ తిరిగి ఆరునెలల తర్వాత అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం అయింది. అయితే కరోనా ఉధృతి నేటికీ తగ్గకపోవడంతో పార్కును శానిటైజ్ […]

Update: 2020-10-05 22:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన నగరంలోని నెహ్రూ జూపార్కను నేటి నుంచి పున:ప్రారంభించనున్నారు. ఈ జూపార్కును ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్ లాక్ 5.0 క్రమంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ మంగళవారం నుంచి జూపార్కులోకి సందర్శకులను అనుమతించనున్నారు. గత మార్చి 15వ తేదీన మూతపడిన జూపార్క్ తిరిగి ఆరునెలల తర్వాత అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం అయింది. అయితే కరోనా ఉధృతి నేటికీ తగ్గకపోవడంతో పార్కును శానిటైజ్ చేశారు. పార్కులో ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు.

Tags:    

Similar News