పెళ్లికి ముందు కలిసుంటే డేటింగ్ చేసేదాన్ని : సింగర్

దిశ, సినిమా : ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా ‘వూట్’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ ఓటీటీ మంచి రేటింగ్‌‌తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌, ఈ రియాలిటీ షోపై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సింగర్ నేహా భాసిన్.. మరో కంటెస్టెంట్ ప్రతీక్ సెహజ్‌పాల్‌‌పై తన ఫీలింగ్స్‌ను బయటపెట్టింది. పెళ్లికి ముందు కలిసుంటే అతనితో డేటింగ్ చేసేదాన్నని చెప్పింది. మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ […]

Update: 2021-09-15 01:48 GMT

దిశ, సినిమా : ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా ‘వూట్’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ ఓటీటీ మంచి రేటింగ్‌‌తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌, ఈ రియాలిటీ షోపై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సింగర్ నేహా భాసిన్.. మరో కంటెస్టెంట్ ప్రతీక్ సెహజ్‌పాల్‌‌పై తన ఫీలింగ్స్‌ను బయటపెట్టింది. పెళ్లికి ముందు కలిసుంటే అతనితో డేటింగ్ చేసేదాన్నని చెప్పింది. మంగళవారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ ఓటీటీ హౌస్‌ను సందర్శించగా.. ప్రతీక్, నేహా సిస్టర్స్ వారిద్దరినీ ఒకరికొకరు దూరం పాటించాలని కోరారు. ఇక వారు షో నుంచి వెళ్లిపోయాక ఇదే విషయంపై ప్రతీక్, నేహాను ప్రశ్నించిన కొరియోగ్రాఫర్ నిషాంత్ భట్.. మీరిద్దరూ సింగిల్‌గా ఉన్నప్పుడు కలిసుంటే డేటింగ్ చేసేవారా? అని అడిగాడు. దీనికి నేను అతన్ని తినేసి ఉండేదాన్నని రిప్లయ్ ఇచ్చిన నేహా.. కచ్చితంగా చేసుండేదాన్నని తెలిపింది. ప్రతీక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.

Tags:    

Similar News