బతికున్నా చనిపోయిందని చెప్పారు

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ విమ్స్ హాస్పిటల్‌పై జరిగిన మరో ఘటన విమర్శలకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఇప్పటికే ఓ వీడియో వైరల్ అయిన సంగతి మరవక ముందే మరో ఘటన వెలుగుచూసింది. ఏకంగా బతికున్న మహిళ.. చనిపోయిందంటూ బంధువులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో విమ్స్‌ హాస్పిటల్‌పై విమర్శలు మరింతగా పెరిగాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా సోకడంతో […]

Update: 2020-08-06 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ విమ్స్ హాస్పిటల్‌పై జరిగిన మరో ఘటన విమర్శలకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఇప్పటికే ఓ వీడియో వైరల్ అయిన సంగతి మరవక ముందే మరో ఘటన వెలుగుచూసింది. ఏకంగా బతికున్న మహిళ.. చనిపోయిందంటూ బంధువులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో విమ్స్‌ హాస్పిటల్‌పై విమర్శలు మరింతగా పెరిగాయి.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా సోకడంతో గత నెల 27న విశాఖ విమ్స్‌లో చేరింది. అయితే, బాధితురాలు చనిపోయిందంటూ ఆస్పత్రి సిబ్బంది ఆగస్టు 1న సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి ఆరా తీస్తే ఆమె బతికే ఉన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. పైగా మృత దేహాన్ని తీసుకుపోవడానికి ఎవరురాలేదని విమ్స్ డైరెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

Tags:    

Similar News