త్వరలోనే NEET-2021 అడ్మిట్ కార్డులు
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకోసం నిర్వహించే నీట్ 2021 పరీక్ష అడ్మిట్ కార్డులు త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 12 నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) నిర్వహించే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఐడెంటింటి కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.. * […]
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకోసం నిర్వహించే నీట్ 2021 పరీక్ష అడ్మిట్ కార్డులు త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 12 నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) నిర్వహించే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఐడెంటింటి కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
అడ్మిట్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
* ముందుగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) అధికారిక వెబ్‌సైట్ nbe.edu.inలోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉన్న ‘నీట్ పీజీ 2021 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్’ను క్లిక్ చేయాలి. (ఏప్రిల్ 12 తర్వాత లింక్ యాక్టివేట్ అవుతుంది)
* ఆ లింక్ క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* తర్వాత లాగిన్ వివరాలతో పాటు పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
* వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు డిస్‌ప్లే అవుతుంది.
* భవిష్యత్తు అవసరాల కోసం అడ్మిట్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకోవాలి.