‘సర్ణ’ పతకాల వీరుడికి సెల్యూట్.. ప్రముఖుల అభినందనలు!

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. జావెలిన్ త్రో విభాగంలో 23 ఏళ్ల నీరజ్ చోప్రా 87.58 మీటర్ల దూరంలో విసిరి ఇండియా కల నేరవేర్చాడు. సింగిల్స్ విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయంపై భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందిస్తూ.. నేటి యువతకు నీరజ్ చోప్రా స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. అదేవిధంగా […]

Update: 2021-08-07 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. జావెలిన్ త్రో విభాగంలో 23 ఏళ్ల నీరజ్ చోప్రా 87.58 మీటర్ల దూరంలో విసిరి ఇండియా కల నేరవేర్చాడు. సింగిల్స్ విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ విజయంపై భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్పందిస్తూ.. నేటి యువతకు నీరజ్ చోప్రా స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పసిడి సాధించిన నీరజ్‌కు అభినందనలు తెలిపారు. 2018 కామన్ వెల్త్, ఆసియా క్రీడల్లోనూ నీరజ్ చోప్రా స్వర్ణ పతకాలు సాధించాడు. హర్యానాలోని పానిపట్‌కు చెందిన నీరజ్.. ఇండియన్ ఆర్మీలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. గతంతో పోలిస్తే టోక్యో ఒలింపిక్స్‌లోనే భారత్‌కు 7అత్యధిక పతకాలు వచ్చాయి.

Tags:    

Similar News