బిగ్ బ్రేకింగ్ : నెరవేరిన వందేళ్ల కల.. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం నుంచి భారత్‌కు ఇప్పటివరకు బంగారు పతకం రాలేదు. సెమీస్ వరకు వెళ్లిన మన అథ్లెట్లు చాలా మంది పోరాడి ఓడారు. అయితే, జావెలిన్ త్రో  విభాగంలో మాత్రం ఇండియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా (23) ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ఫైనల్ మ్యాచ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తూ వచ్చాడు. మొదటి రౌండ్‌లో 87.03 మీటర్లు విసిరిన నీరజ్, రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు, మూడో రౌండ్‌లో 76.79 […]

Update: 2021-08-07 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం నుంచి భారత్‌కు ఇప్పటివరకు బంగారు పతకం రాలేదు. సెమీస్ వరకు వెళ్లిన మన అథ్లెట్లు చాలా మంది పోరాడి ఓడారు. అయితే, జావెలిన్ త్రో విభాగంలో మాత్రం ఇండియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా (23) ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ఫైనల్ మ్యాచ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తూ వచ్చాడు. మొదటి రౌండ్‌లో 87.03 మీటర్లు విసిరిన నీరజ్, రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు, మూడో రౌండ్‌లో 76.79 మీటర్ల దూరం విసిరాడు.

ప్రత్యర్థి దేశాల అథ్లెట్లు మాత్రం నీరజ్ చోప్రా రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ప్రారంభం నుంచి చోప్రానే టాప్ -1లో కొనసాగుతూ వచ్చాడు. మొదటి మూడు రౌండ్ల తర్వాత ముగ్గురు ఆటగాళ్ల ఎలిమినేషన్ జరిగింది. మొత్తం ఆరు రౌండ్లు పూర్తయ్యాక ఫలితాన్ని నిర్వాహకులు ప్రకటించారు. కాగా, ఐదు రౌండ్ల ఫలితాలు వెలువడే వరకు నీరజ్ చోప్రానే టాప్‌లో కొనసాగాడు. చివరి రౌండ్లో 84.24 మీటర్ల దూరంలో విసరగా.. నీరజ్ బంగారు పతకాన్ని ఒడిసి పట్టాడు.

దీంతో ఇండియాకు మొట్టమొదటి గోల్డ్ మెడల్ సిద్ధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణం కలను నెరవేర్చిన అథ్లెట్‌గా నీరజ్ రికార్డుల కెక్కాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు బంగారు పతకం రావడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బంగారు పతకం రావడంతో ఇండియా ఖాతాలో మొత్తం 7 మెడల్స్ చేరాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వ్యక్తిగత విభాగంలో నీరజ్ చోప్రా సాధించిన బంగారు పతకం రెండోవది కానుంది.

Tags:    

Similar News