అత్యున్నత క్రీడా పురస్కారాలు.. నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్‌కు ఖేల్‌రత్న
దిశ, స్పోర్ట్స్: భారత అత్యున్నత క్రీడా పురస్కారాలకు నామినేషన్లను ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా, పారా ఒలింపియన్ అవని లేఖరా, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సహా 11 మందిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డులకు సిఫార్సు చేశారు. ఇక క్రికెటర్ శిఖర్ ధావన్ సహా 35 మందికి అర్జున అవార్డుల నామినేషన్లు లభించాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ ప్లేయర్లు అందరికీ (గతంలో […]
దిశ, స్పోర్ట్స్: భారత అత్యున్నత క్రీడా పురస్కారాలకు నామినేషన్లను ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా, పారా ఒలింపియన్ అవని లేఖరా, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సహా 11 మందిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డులకు సిఫార్సు చేశారు. ఇక క్రికెటర్ శిఖర్ ధావన్ సహా 35 మందికి అర్జున అవార్డుల నామినేషన్లు లభించాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ ప్లేయర్లు అందరికీ (గతంలో అవార్డు పొందిన వారు మినహా) అర్జున అవార్డుల నామినేషన్లు అందాయి. భారత హాకీ గోల్ కీపర్ శ్రీజేశ్‌ను ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. ఇక భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రికి కూడా ఖేల్‌రత్న అవార్డు వరించనున్నది. అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోనున్న తొలి భారత ఫుట్‌బాలర్‌గా సునిల్ ఛెత్రి రికార్డు సృష్టించనున్నాడు.
ఇవే నామినేషన్లు..
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు 2021
1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)
2. రవి దహియా (రెజ్లింగ్)
3. పీఆర్ శ్రీజేశ్ (హాకీ)
4. లవ్లీనా బోర్గహెయిన్ (బాక్సింగ్)
5. సునిల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
6. మిథాలీ రాజ్ (క్రికెట్)
7. ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
8. సుమిత్ అంటిల్ (అథ్లెటిక్స్)
9. అవనీ లేఖరా (షూటింగ్)
10. క్రిష్ణ నగార్ (బ్యాడ్మింటన్)
11. మనీశ్ నర్వాల్ (షూటింగ్)
అర్జున అవార్డులు
1. యోగేశ్ కథూనియా (డిస్కస్ త్రో)
2. నిషాద్ కుమార్ (హై జంప్)
3. ప్రవీణ్ కుమార్ (హై జంప్)
4. శరద్ కుమార్ (హై జంప్)
5. సుహాస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్)
6. సింగ్‌రాజ్ అధాన (షూటింగ్)
7. భవానీ పటేల్ (టేబుల్ టెన్నిస్)
8. హర్వీందర్ సింగ్ (ఆర్చరీ)
9. శిఖర్ ధావన్ (క్రికెట్)
వీరితో పాటు భారత హాకీ జట్టు సభ్యులకు అర్జున అవార్డులు లభించనున్నాయి.