అక్కడ హెయిర్ కట్‌కు ఆధార్ తప్పనిసరి

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో.. ‘హెయిర్ కట్’ కోసం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇబ్బంది పడ్డారు. ఇదే టైమ్‌లో చాలామంది సెలబ్రిటీలు ఇంట్లోనే హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేశారు. హెయిర్ కట్‌పై ఎన్నో ఫన్నీ మీమ్స్, కార్టూన్లు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు లాక్‌డౌన్ 4.0లో సెలూన్లకు అనుమతివ్వడంతో చాలామంది తమ ‘తలభారం’ తీర్చుకున్నారు. సెలూన్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంతమందికి కరోనా […]

Update: 2020-06-02 04:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలంలో.. ‘హెయిర్ కట్’ కోసం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇబ్బంది పడ్డారు. ఇదే టైమ్‌లో చాలామంది సెలబ్రిటీలు ఇంట్లోనే హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేశారు. హెయిర్ కట్‌పై ఎన్నో ఫన్నీ మీమ్స్, కార్టూన్లు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు లాక్‌డౌన్ 4.0లో సెలూన్లకు అనుమతివ్వడంతో చాలామంది తమ ‘తలభారం’ తీర్చుకున్నారు. సెలూన్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంతమందికి కరోనా వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులోని రూరల్ ఏరియాలో సెలూన్లు రీఓపెన్ చేస్తుండటంతో ఇంతకుముందు సెలూన్లలో కరోనా కేసులు నమోదైన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు సర్కారు సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో హెయిర్ కట్ చేసుకోవడానికి సెలూన్‌కు వెళ్తుంటే వెంట తప్పనిసరిగా ఆధార్ తీసుకు వెళ్లాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే కస్టమర్ల పూర్తి బయోడేటాతోపాటు ఇంటి అడ్రస్, ఫోన్, ఆధార్ నంబర్లను తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. ఆయా షాపుల దగ్గర తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజరు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. షాప్‌లో సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని, కస్టమర్ల తాకిడిని తగ్గించడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని హెయిర్ కట్ చేయాలని సూచించింది. హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని, బ్లేడ్లు కూడా ఒకరికి మించి మళ్లీ వాడరాదని ఆదేశించింది. ఏసీలు, కూలర్లు కూడా వాడరాదని తేల్చి చెప్పింది. హెయిర్ కట్ చేసే వాళ్లు విధిగా హ్యాండ్ గ్లౌజులు, ఫేస్ మాస్క్‌లు ధరించాలని తెలిపింది.

భారత్‌లో మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నది తమిళనాడులోనే కావడంతో అక్కడి సర్కారు లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ 23,495 పాజిటివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News