38లక్షల కేసులకు చేరువలో భారత్..!

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. వైరస్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వ్యాప్తి తీవ్రతలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే, దేశంలో రికవరీ రేటు పెరుగుతుండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర వైద్యారోగ్య విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. దేశంలో కరోనా కేసులు 38లక్షలకు చేరువలో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 78,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల […]

Update: 2020-09-02 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. వైరస్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వ్యాప్తి తీవ్రతలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే, దేశంలో రికవరీ రేటు పెరుగుతుండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర వైద్యారోగ్య విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. దేశంలో కరోనా కేసులు 38లక్షలకు చేరువలో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 78,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37,69,523కు చేరుకుంది. ప్రస్తుతం 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి.

గడచిన 24గంటల్లో 62,026 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తంగా 29,01,908 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో 1045 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 66,333 కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలాఉండగా, గత 24గంటల్లో 10,12,000 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

Tags:    

Similar News