మెగాస్టార్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్?
దిశ, వెబ్‌డెస్క్ : ‘ఖైదీ నెం.150’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరు డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’(Acharya) చేస్తుండగా.. ఇందులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే షూటింగ్‌లో చిరు, చరణ్, కాజల్ పాల్గొననున్నారు. దీంతో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ‘ఖైదీ నెం.150’తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరు డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’(Acharya) చేస్తుండగా.. ఇందులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే షూటింగ్‌లో చిరు, చరణ్, కాజల్ పాల్గొననున్నారు.
దీంతో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనుండగా.. ఇప్పటికే రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో రాంచరణ్, ఎన్వీప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.
ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఒరిజినల్ మూవీలో హీరో మిడిల్ ఏజ్ క్యారెక్టర్‌లో కనిపించడంతో పాటు హీరోకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదు. కానీ, చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తెలుగు వెర్షన్ స్క్రిప్ట్‌లో హీరోకి భార్యతోపాటు మరో కొత్త పాత్రను డిజైన్ చేసినట్టు టాక్. ఈ పాత్రల కోసం దక్షిణాది అగ్ర కథానాయికలు నయనతార, త్రిషను సంప్రదించనున్నట్టు తెలుస్తోంది. కాగా లేడీ సూపర్ స్టార్ నయనతార ‘సైరా’లో చిరుకు భార్యగా నటించగా, త్రిష ‘స్టాలిన్’లో చిరుతో చిందేసింది. ఇక ఒరిజినల్ ‘లూసిఫర్’(lucifer) స్క్రిప్ట్‌కి తెలుగులో రిమేక్ స్క్రిప్ట్‌కి చాలా చేంజెస్ ఉంటాయని, చిరు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా రైటర్ ఆకుల శివ కమర్షియల్ యాంగిల్‌తో పాటు కామెడీని జోడిస్తారని అభిమానులు అంటున్నారు. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియాలంటే మూవీ గురించి అధికారిక ప్రకటన రావాల్సిందే.