ఎంగేజ్మెంట్ చేసుకున్న నయనతార.. పెళ్లి అప్పుడే!
దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరుపుకుందని కోలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. శివన్ సోషల్ మీడియా ఎకౌంట్లో తన గుండెల మీద నయన్ చేయి ఉన్న ఓ రొమాంటిక్ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో నయన్ వేలికి నిశ్చితార్థపు ఉంగరం కనిపించడమే ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యేలా చేసింది. 2015లో ‘నేనూ రౌడీనే’ […]
దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరుపుకుందని కోలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. శివన్ సోషల్ మీడియా ఎకౌంట్లో తన గుండెల మీద నయన్ చేయి ఉన్న ఓ రొమాంటిక్ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో నయన్ వేలికి నిశ్చితార్థపు ఉంగరం కనిపించడమే ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యేలా చేసింది. 2015లో ‘నేనూ రౌడీనే’ సినిమా టైమ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి విషయమై గతంలో మీడియా ప్రశ్నించగా.. డేటింగ్ బోర్ కొడితేనే పెళ్లి అని ఓపెన్‌గా సమాధానమిచ్చాడు శివన్. మొత్తానికి మేలో శుభముహూర్తాలు మొదలైన వెంటనే నయన్ శివన్‌ల పెళ్లి చూడొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.