పేరుకే సూపర్ స్టార్స్.. అంతా ఫేక్ యాక్టింగ్ : నటుడి విమర్శలు
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ బాలీవుడ్ సూపర్ స్టార్స్‌పై విమర్శలు గుప్పించారు. కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే నటులకు సలహాలిచ్చిన ఆయన.. యాక్టింగ్‌లో సూపర్ స్టార్స్‌ను మాత్రం ఫాలో కాకూడదని సూచించారు. వారిదంతా ఫేక్ యాక్టింగ్ అని, అలాంటి నటనకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యాక్టింగ్‌లో తమ ఒరిజినాలిటీ కోల్పోకూడదని సజెస్ట్ చేశారు. అస్పైరింగ్ యాక్టర్స్ సూపర్ స్టార్‌లా యాక్ట్ చేస్తే ఆడియన్స్ ఎందుకు చూస్తారు.. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్, ఒరిజినాలిటీని చూపిస్తేనే ఇండస్ట్రీలో […]
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ బాలీవుడ్ సూపర్ స్టార్స్‌పై విమర్శలు గుప్పించారు. కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే నటులకు సలహాలిచ్చిన ఆయన.. యాక్టింగ్‌లో సూపర్ స్టార్స్‌ను మాత్రం ఫాలో కాకూడదని సూచించారు. వారిదంతా ఫేక్ యాక్టింగ్ అని, అలాంటి నటనకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యాక్టింగ్‌లో తమ ఒరిజినాలిటీ కోల్పోకూడదని సజెస్ట్ చేశారు. అస్పైరింగ్ యాక్టర్స్ సూపర్ స్టార్‌లా యాక్ట్ చేస్తే ఆడియన్స్ ఎందుకు చూస్తారు.. సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్, ఒరిజినాలిటీని చూపిస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరని, అప్పుడే ఆడియన్స్ కూడా గుర్తిస్తారన్నారు.
ఇక ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్న బిగ్ స్టార్స్‌పై ఫైర్ అయ్యారు సిద్దిఖీ. వీరంతా ఇంతకుముందు ఎందుకు ఓటీటీకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదని ప్రశ్నించారు. లాక్‌డౌన్ వల్ల థియేటర్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టే డిజిటల్ వరల్డ్‌లోకి వస్తున్నారు తప్ప.. ఏదో కొత్తగా ట్రై చేయాలని మాత్రం కాదన్నారు. కొన్ని బిగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బిగ్ స్టార్స్‌ను తీసుకుంటున్నాయని, ఇది అసలు యాక్సెప్ట్ చేయలేని విషయం అన్నారు. స్టార్టింగ్‌లో కంటెంట్‌ను నమ్ముకుని, సినిమా మీద పాషన్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు వచ్చిన నటులను ప్రశంసించారు.