కథను అందంగా చూపించడమే ‘నాట్యం’
దిశ, సినిమా: ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యా రాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. నిశృంకల ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాట్యం ప్రధానాంశంగా శాస్త్రీయ సంగీతం, సాహిత్యం నేపథ్యంలో సాగిన టీజర్ అద్భుతంగా ఉంది. ‘ఒక కథను అందంగా చూపించడమే నాట్యం’ అనే కాన్సెప్ట్‌తో దర్శకులు రేవంత్ కోరుకొండ ఈ సినిమాను రూపొందించారు. కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు […]
దిశ, సినిమా: ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యా రాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. నిశృంకల ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాట్యం ప్రధానాంశంగా శాస్త్రీయ సంగీతం, సాహిత్యం నేపథ్యంలో సాగిన టీజర్ అద్భుతంగా ఉంది. ‘ఒక కథను అందంగా చూపించడమే నాట్యం’ అనే కాన్సెప్ట్‌తో దర్శకులు రేవంత్ కోరుకొండ ఈ సినిమాను రూపొందించారు.
కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు స్క్రిప్ట్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా నిర్వర్తించిన రేవంత్.. ‘కాదంబరి’ కథను నాట్యం ద్వారా తెరపై చూపించబోతున్నారు. సంధ్యారాజు ప్రతీ ఫ్రేమ్‌లోనూ అందంగా కనిపించగా.. టీజర్ చూస్తుంటే సాగర సంగమం, పౌర్ణమి చిత్రాలు గుర్తుకొస్తున్నాయని చెప్తున్నారు నెటిజన్లు. ఇక శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం చిత్రానికి ప్లస్ కాగా.. కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, రుక్మిణి విజయకుమార్, బేబీ దీవెన, హైపర్ ఆది కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.