ఫిల్మ్ చాంబర్ పదవికి నట్టికుమార్ రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్ :  తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రెటరీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు నిర్మాత నట్టికుమార్. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా కూడా తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీలో కొందరు సినీ పెద్దల కారణంగా థియేటర్లపై ఆధారపడ్డ థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కూలీలు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సినిమా హాళ్ల ఓపెనింగ్‌కు అనుమతించినా సరే.. ఇండస్ట్రీ పెద్దలు తమ స్వప్రయోజనాల కోసం సినిమాల రిలీజ్‌కు అడ్డుపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా చిన్న నిర్మాతల సినిమాల విడుదలను అడ్డుకుంటున్నారని, ఇందుకు […]

Update: 2020-12-12 02:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రెటరీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు నిర్మాత నట్టికుమార్. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా కూడా తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీలో కొందరు సినీ పెద్దల కారణంగా థియేటర్లపై ఆధారపడ్డ థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కూలీలు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సినిమా హాళ్ల ఓపెనింగ్‌కు అనుమతించినా సరే.. ఇండస్ట్రీ పెద్దలు తమ స్వప్రయోజనాల కోసం సినిమాల రిలీజ్‌కు అడ్డుపడుతున్నారని అన్నారు.

ముఖ్యంగా చిన్న నిర్మాతల సినిమాల విడుదలను అడ్డుకుంటున్నారని, ఇందుకు నిరసనగా రాజీనామా చేశానని తెలిపారు. బడా ప్రొడ్యూసర్స్ 2021 మార్చి వరకు కూడా థియేటర్లను మూసి ఉంచాలనే ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తోందని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు నట్టి కుమార్. దీనిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

Tags:    

Similar News