16 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు.. అందుకే…
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ , నిత్యావసరాలు, మెడిసిన్ ధరలకు నిరసనగా వామపక్ష పార్టీలు దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు వామపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలపై పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 16 నుంచి 30 వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. తరుచుగా పెరుగుతున్న నిత్యావసర, పెట్రోల్ ధరలు ప్రజల జీవనోపాధిపై దాడి చేస్తున్నాయని పార్టీలు పేర్కొన్నాయి. 2 మే 2021 శాసన సభల […]
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ , నిత్యావసరాలు, మెడిసిన్ ధరలకు నిరసనగా వామపక్ష పార్టీలు దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు వామపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలపై పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 16 నుంచి 30 వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
తరుచుగా పెరుగుతున్న నిత్యావసర, పెట్రోల్ ధరలు ప్రజల జీవనోపాధిపై దాడి చేస్తున్నాయని పార్టీలు పేర్కొన్నాయి. 2 మే 2021 శాసన సభల ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటి వరకు 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచారనీ తెలిపాయి. కొవిడ్ సంక్షోభం సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను మరింత భాదలకు కేంద్రం గురిచేస్తోందని ఆరోపించాయి.