ఒక్కరోజులో 10వేల మందికి కరోనా!

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ జెట్ స్పీడులో దూసుకుపోతుంది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే 10వేలకు చేరువలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దేశంలోకి కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి ఒకే రోజులో నమోదైన అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,26,770కి చేరాయి. […]

Update: 2020-06-05 11:34 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ జెట్ స్పీడులో దూసుకుపోతుంది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,851 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కరోజులోనే 10వేలకు చేరువలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దేశంలోకి కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి ఒకే రోజులో నమోదైన అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 2,26,770కి చేరాయి. ఒక్కరోజే ఈ వ్యాధితో 273 మంది చనిపోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6,348 మరణాలు సంభవించాయి.

దేశంలో నేటికి 1,09,462 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా 1,10,960 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. కరోనా మరణాల్లో దేశం 12వ స్థానంలో, మొత్తం కేసుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు 15 నుంచి 17 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అంతకంతకూ తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు ఉన్న మహారాష్ట్రలో ఈ ఒక్కరోజే 2,436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కేసుల సంఖ్య 80,229కి చేరింది. గడిచిన 20 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఒక్కరోజులోనే 139 మంది ప్రాణాలు కోల్పోగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,849కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,150 కేసులు నమోదు కాగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 45,854కు చేరింది. ముంబైలో కొత్తగా 53 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, నగరంలో నేటికి మరణించిన వారి సంఖ్య 1,518కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 1,438 కొత్త కేసులు నమోదవ్వగా, మొత్తం కేసుల సంఖ్య 28,694కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 12 మంది మరణించడంతో, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 232కి చేరింది. రాజధాని చెన్నై నగరంలో ఒక్కరోజే 1,116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 1,330 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 26,334కు చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనాతో 708 మంది మరణించగా 15,311 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక్కరోజే 510 కొత్త కేసులు తేలగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య19,119కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 35 మంది కరోనాతో చనిపోగా ఇప్పటివరకు ఆ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,190కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 4,250కి చేరింది. ప్రస్తుతం 1,060 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 73కి చేరింది.

Tags:    

Similar News