భారత్‌తో లక్షదాటిన కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. గత వారం నుంచి ఒక్క రోజుకు సగటున 4 వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి.మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,970 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,139కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 3,163 మంది మరణించారు. నేటికి 39,174 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 58,802 యాక్టివ్ కేసులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడయ్యాయి. వైరస్ కేసులు రెట్టింపై లక్ష […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. గత వారం నుంచి ఒక్క రోజుకు సగటున 4 వేల చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నాయి.మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,970 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,139కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 3,163 మంది మరణించారు. నేటికి 39,174 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 58,802 యాక్టివ్ కేసులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడయ్యాయి. వైరస్ కేసులు రెట్టింపై లక్ష మార్క్‌ను చేరుకోవడానికి 12 రోజులు పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో కొనసాగుతోంది. 15 లక్షల కేసులతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధిక కేసులున్న మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 2,005 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 35,058కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 51 మంది కరోనాతో మరణించగా ఇప్పటివరకు 1,294 మంది చనిపోయారు. రాజధాని ముంబైలో 1,411 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 22,563కు చేరింది. ఇక్కడ ఒక్కరోజే 43 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 800కు వెళ్లింది. తమిళనాడులోనూ కరోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 601 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 12,448కి చేరింది. ఇక్కడ కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 84కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,466 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్‌లో ఒక్కరోజే 366 కొత్త కేసులు నమోదవ్వగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,745కు చేరింది. ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మొత్తం 694 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 2,339కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 691 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 52 మంది వైరస్ బారిన మరణించారు.