Encounter : ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి
చత్తీస్ఘడ్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది.
దిశ, భద్రాచలం : చత్తీస్ఘడ్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. వర్షాకాలం అడవి పై పట్టు సాధించేందుకు మావోయిస్టులు, భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులను మట్టుపెట్టిన భద్రత బలగాలు, గురువారం దంతెవాడ జిల్లా, కిరణ్ దుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూమ్నార్ పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన
ఎదురు కాల్పులలో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఇదిలా ఉండగా బుధవారం అర్ధరాత్రి టారేం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంద మార్క అడవుల్లో ఐఈడీ బాంబును మావోయిస్టులు పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్విండ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు పాతర పేల్చడంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని అంబులెన్స్ ద్వారా బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.