పార్లమెంట్ సభలో బిడ్డకు పాలు పట్టిన మహిళా ఎంపీ..

తన ఆరు నెలల బిడ్డకు ఒక మహిళా ఎంపీ పార్ల‌మెంట్‌లో కూర్చొని పాలు ఇచ్చింది.

Update: 2023-06-08 14:10 GMT

రోమ్ : తన ఆరు నెలల బిడ్డకు ఒక మహిళా ఎంపీ పార్ల‌మెంట్‌లో కూర్చొని పాలు ఇచ్చింది. దీంతో పార్లమెంటులోని సభ్యులంతా నిలబడి కరతాళ ధ్వనులతో ఆమెకు అభినందనలు తెలిపారు. చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలు తాగిస్తూనే వృత్తి ధర్మాన్ని పాటించినందుకు ఆమెను ఆకాశానికి ఎత్తారు. ఈ ఘట్టానికి

ఇట‌లీ పార్ల‌మెంట్‌ వేదికగా నిలిచింది. పార్లమెంట్‌లో కూర్చొని బిడ్డకు పాలు తాగించిన ఆ ఎంపీ పేరు గిల్డా స్పోర్టిల్లో. అకస్మాత్తుగా ఆకలికి ఏడుపు అందుకున్న కుమారుడిని సముదా యించేందుకు.. కూర్చున్న స్థానంలోనే ఆమె చనుబాలు తాగించింది. ఏడాదిలోపు వయసు కలిగిన చిన్నారులకు పార్లమెంటులోనూ పాలు ఇవ్వవచ్చని గత నవంబరులో ఇటలీ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం తెచ్చాక.. పార్లమెంటులో బిడ్డకు పాలు తాగించిన తొలి ఎంపీగా గిల్డా స్పోర్టిల్లో నిలిచారు.


Similar News