అత్యధిక, అత్యల్ప మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు వీరే

ఈసారి ఎన్నికల్లో కనీసం నలుగురు బీజేపీ నేతలు అత్యధిక మెజారిటీని సాధించి గెలుపును రికార్డులకెక్కించారు.

Update: 2024-06-04 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే అంశాలతో పాటు చాలామంది ఎవరు అత్యధిక మెజారిటీ సాధించారనే అంశం కీలకంగా ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో కనీసం నలుగురు బీజేపీ నేతలు అత్యధిక మెజారిటీని సాధించి గెలుపును రికార్డులకెక్కించారు. వారిలో అసోంలోని దుబ్రీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ ఏకంగా 10.12 లక్షల కోట్ల మెజారిటీ పొంది రికార్డు సాధించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఏకంగా 10.08 లక్షల ఓట్లతో గెలిచారు. వీరిద్దరి తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్ బీజేపీ నేత సీఆర్ పాటిల్‌లు తమ నియోజకవర్గాల నుంచి 7 లక్షల ఓట్లతో విజయం దక్కించుకున్నారు. గుజరాత్‌లోని నవ్‌సారి నుంచి మూడుసార్లు ఎంపీ అయిన సీఆర్ పాటిల్ రెండో అత్యధిక మెజారిటీ రికార్డును బద్దలు చేస్తూ ఈసారి 7.73 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 8.21 లక్షల ఓట్లతో, అమిత్ షా గాంధీనగర్ నుంచి 7.44 లక్షల అధిక ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి, కీలకనేత రాహుల్ గాంధీ తన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి 3.90 లక్షల ఓట్లు, కేరళలోని రాయ్‌బరేలీలో 3.64 లక్షల ఓట్లను దక్కించుకున్నారు. వడోదరలో బీజేపీ అభ్యర్థి హేమంగ్ జోషి 5.82 లక్షల ఓట్లు, నోయిడాలో సైతం బీజేపీకి చెందిన మహేశ్ శమ్ర 5.57 లక్షల ఓట్ల అధిక మెజారిటీ సాధించారు.

తక్కువ ఓట్ల తేడా ఎవరెవరికంటే..

మరోవైపు దేశవ్యాప్తంగా అనేక లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు 1,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. వారిలో ముంబై నార్త్‌వెస్ట్ స్థానంలో శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ ప్రత్యర్థి శివసేన(యూబీటీ)కి చెందిన అమోల్ గజానన్ కీర్తికర్‌పై కేవలం 48 ఓట్లతో గెలిచారు. సేలంపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రామశంకర్ రాజ్‌భర్ 3573 ఓట్లతో గెలుపొందారు. కేరళలోని అట్టింగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏడీవీ అదూర్ ప్రకాష్ కేవలం 684 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.   


Similar News