బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవు.. ట్రంప్ ని ప్రశంసించిన నిక్కీ హేలీ

రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి ఆ పార్టీ కీలక నేత నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవని ట్రంప్ ని కొనియాడారు.

Update: 2024-07-17 04:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి ఆ పార్టీ కీలక నేత నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధాలు జరగవని ట్రంప్ ని కొనియాడారు. అమెరికాలో మిల్వాకీలో జరుగుతున్న నేషనల్‌ కన్వెన్షన్‌లో ఆమె ప్రసంగించారు. ట్రంప్ పై ప్రశంసలు కురిపిస్తూనే జో బైడెన్, బరాక్ ఒబమాలపై నిప్పులు కురిపించారు. యుద్ధాలను ఆపే సామర్థ్యం ఉన్న నాయకుడు ట్రంప్ అని అన్నారు. ‘‘ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పుతిన్‌ క్రిమియాపై దండెత్తారు. బైడెన్‌ అధికారంలో ఉండగా.. మొత్తం ఉక్రెయిన్‌పైనే ఆక్రమించారు. ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పుతిన్‌ ఏమీ చేయలేదు. ఆక్రమణలు, యుద్ధాలు ఏమీ లేవు. ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తారని పుతిన్ కు తెలుసు. అందుకే పుతిన్‌ ఉక్రెయిన్‌ పై దాడులకు పాల్పడలేదు. బలమైన అధ్యక్షుడు యుద్ధాలను ప్రారంభించరు. నిరోధిస్తారు’’ అని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.

ట్రంప్ ని ప్రశంసించిన నిక్కీ హేలీ

ట్రంప్ హయాంలోని విదేశాంగ విధానాలను కూడా నిక్కీ హేలీ ప్రశంసించారు. ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత దేశ ప్రజలు ఐక్యత గురించి నొక్కి చెప్పారు. ఈ తరుణంలో మన విభేదాలను పక్కనపెట్టి మనల్ని ఐక్యం చేసి దేశాన్ని బలోపేతం చేసే వాటిపైనా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉందని అన్నారు. అమెరికన్లు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని చూసినప్పుడు ఇది అమెరికాని ద్వేషించే శత్రువుల విజయం అని పేర్కొన్నారు. కాలేజీ క్యాంపస్‌లలో లేదా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో అలాంటి వారిని చూస్తున్నామని అన్నారు. కానీ, ఐక్యతతో ఆ భయాలను జయించగలమని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో చివరివరకు పోరాడిన వ్యక్తి నిక్కీ హేలీ.


Similar News