ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి ఎలాంటి అధికారాలు ఉంటాయి.. జీతం ఎంత ?

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఇండియా కూటమి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-27 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఇండియా కూటమి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో 10 సంవత్సరాల తరువాత లోక్ సభలో తొలిసారిగా ప్రతిపక్ష నేతను చూస్తున్నాం. అయితే మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీకి ఎలాంటి అధికారాలు ఉంటాయి..? ఆయన జీతం ఎంతో తెలుసుకుందాం.

పార్లమెంటు చట్టం 1977లో ప్రతిపక్ష నాయకుల జీతాలు, అలవెన్సుల ప్రకారం రాహుల్ గాంధీ జీతం రూ.3.3 లక్షలు లభిస్తుంది. కేబినెట్ మంత్రికి ఉండే భద్రత కల్పిస్తారు. ఇందులో Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేబినెట్ మంత్రి తరహా ప్రభుత్వ బంగ్లా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో ముందు వరుసలో కూర్చోవాలి. కీలకమైన ప్యానెల్స్ లో రాహుల్ గాంధీ కూడా ఒక సభ్యుడిగా కొనసాగనున్నారు. ఎన్నికల కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్ వంటి నియామకాలపై నిర్ణయం తీసుకునే ప్యానెల్ లో ప్రధాన మంత్రితో పాటు సభ్యుడిగా ఉండనున్నారు. ప్రభుత్వం తమ నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి బీజేపీలో చేర్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకు ఇది పెద్ద ఊపునిస్తుంది.


Similar News