100 విమానాలకు బాంబు బెదిరింపులు.. 16 రోజుల్లో 510కి చేరిన థ్రెట్స్!

Update: 2024-10-29 18:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు (bomb threats) కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 100 ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ (Indian airlines) విమానాలకు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వచ్చినట్లు ఏవీయేషన్ అధికారులు(Aviation officers) వెల్లడించారు. మొత్తం చూసుకుంటే గత 16 రోజుల వ్యవధిలో ఏకంగా 510 జాతీయ, అంతర్జాతీయ విమానాలకు సోషల్ మీడియా వేదికగా ఏవీయేషన్ సెక్యూరిటీకి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో ఎయిర్ ఇండియాకు -36 సార్లు, ఇండిగో ఎయిర్ లైన్స్ -35, విస్తారా ఎయిర్ లైన్స్‌కు -32 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని తేల్చారు. ఇకపోతే కేవలం అక్టోబర్ నెలలోనే బెదిరింపు ఘటనలకు సంబంధించి ముంబై పోలీసులు ఏకంగా 14 కేసులు నమోదు చేశారు. వరుసగా బెదిరింపు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సదరు సంస్థలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రాయుడు సైతం స్పష్టంచేశారు.

Tags:    

Similar News