విపక్ష కూటమి అస్త్రం ‘ఉల్గులన్’.. ఈ పదం వెనుక గ్రేట్ హిస్టరీ!

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ రాజధాని రాంచీలో విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్వహించిన ర్యాలీ పేరు ‘ఉల్గులన్ న్యాయ్’ !!

Update: 2024-04-21 14:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ రాజధాని రాంచీలో విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్వహించిన ర్యాలీ పేరు ‘ఉల్గులన్ న్యాయ్’ !! రాంచీ సభ నేపథ్యంలో ఈ ర్యాలీ పేరు సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ‘ఉల్గులన్’ పదానికి అర్థం ఏమిటి ? అనేది తెలుసుకునేందుకు నెటిజన్లు పెద్దఎత్తున గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ శోధనలో వారు చారిత్రక వాస్తవాలను కళ్లకు కట్టిన విధంగా తెలుసుకున్నారు. అవేమిటో మనమూ తెలుసుకుందాం..

ఆదివాసీ ఉద్యమంతో..

దేశంలో ధరల మంట, రైతులకు జరుగుతున్న అన్యాయం, ప్రతిపక్ష నేతల అణచివేతకు వ్యతిరేకంగా ఇండియా కూటమి రాంచీలో ఆదివారం సభను నిర్వహించింది. దీనికి ‘ఉల్గులన్ న్యాయ్’ అనే పేరు పెట్టారు. ‘న్యాయ్’ అనేది రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు సంబంధించిన పదం. ‘ఉల్గులన్’ అనేది జార్ఖండ్‌ గడ్డపై జరిగిన ఆదివాసీ ఉద్యమంతో ముడిపడిన పదం.

బిర్సా ముండా పోరాటం..

‘ఉల్గులన్’ అనేది జార్ఖండ్‌కు చెందిన ముండారీ భాషలోని పదం. ‘విప్లవం’ అని దీని అర్థం. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విప్లవ యోధుడు బిర్సా ముండా చేసిన పోరాటానికి ‘ఉల్గులన్’ అనే పేరును వాడేవారు. దీన్నే ఇంగ్లిష్‌లో ‘ది గ్రేట్ టూమల్ట్’ అని పిలుస్తుంటారు. బ్రిటీషర్లను జార్ఖండ్ నుంచి తరిమికొట్టి ఆదివాసీల స్వయంపాలిత ‘ముండా రాజ్’‌ను స్థాపించాలనే గొప్ప లక్ష్యంతో ఆనాడు బిర్సా ముండా ఉద్యమించారు. 1899-1900 సంవత్సరాల మధ్యకాలంలో రాంచీకి దక్షిణంగా ఉన్న ఆదివాసీ ప్రాంతంలో బిర్సా ముండా నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది.

Tags:    

Similar News